Thug Life : ఇక కమల్ ఫోకస్ దీనిపైనే..? ఎక్కడిదాకా వచ్చిందంటే?

Thug Life : లోకనాయకుడు కమల్ హాసన్ వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. కొన్నాళ్ల కింద వరుస ప్లాప్ లతో చాలా డల్ అయిన కమల్ హాసన్ రెండేళ్ల కింద విక్రమ్ సినిమాతో మాస్ కం బ్యాక్ ఇచ్చాడు. ఆ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టి తన సత్తా చాటాడు. ఇక ఈ మధ్యనే కల్కి2898AD సినిమాలో సుప్రీం యాస్కిన్ గా కనిపించి అదరగొట్టాడు. సినిమాలో కనిపించింది తక్కువ సేపే అయినా, ఆ ఇంపాక్ట్ సినిమా మొత్తం ఉంటుంది. అయితే లేటెస్ట్ గా శంకర్ షణ్ముగం తో ఇండియన్2 సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. శంకర్ కమల్ కాంబోలో వచ్చిన ఇండియన్ కి సీక్వెల్ గా తెరకెక్కిన రెండో పార్ట్ ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. సినిమా అంత బ్యాడ్ గా లేకపోయినా రొటీన్ స్క్రీన్ ప్లే తో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక వసూళ్లు కూడా ఆల్మోస్ట్ ఎండ్ అయినట్టే అని చెప్పాలి. ఇదిలా ఉండగా కమల్ హాసన్ ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నాడు అని నెటిజన్లు చర్చిస్తున్నారు.

Kamal Haasan Thug Life Movie Latest Update

ఇక కమల్ ఫోకస్ దీనిపైనే?

ఇక రీసెంట్ గా ఇండియన్2 సినిమాతో ప్లాప్ ని అందుకున్న కమల్ హాసన్ తర్వాత ఏ సినిమాలో నటిస్తాడన్న ప్రశ్న అందరికి వస్తుంది. అయితే కమల్ హాసన్ నటిస్తున్న సినిమాల్లో ఆల్రెడీ నాలుగు సినిమాలు లైన్లో ఉండగా, అందులో మూడు సీక్వెల్ సినిమాలే ఉన్నాయ్. ఇక వీటిలో కల్కి రెండో పార్ట్ రావడానికి ఎలాగో మరో రెండేళ్లు పడుతుంది. ఇక ఇండియన్ పార్ట్ 3 సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రానుంది. ఆ సినిమా షూట్ కూడా దాదాపు పూర్తయిపోగా, మరో రెండు వారాల షూట్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. అలాగే లోకేష్ కనగరాజ్ విక్రమ్ కి కూడా చాలా టైం ఉంది. అయితే ఇప్పుడు కమల్ హాసన్ ప్రాజెక్టుల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా ఏది అంటే అది మణిరత్నం “థగ్ లైఫ్” సినిమా అనే చెప్పాలి. ప్రస్తుతం కమల్ హాసన్ ఈ సినిమాపైనే మొత్తం ఫోకస్ పెట్టాడని సమాచారం.

- Advertisement -

షూట్ ఎంతవరకు వచ్చిందంటే?

ఇక మణిరత్నం కమల్ హాసన్ కాంబోలో నాయకుడు సినిమా తర్వాత మళ్ళీ మూడు దశాబ్దాల తర్వాత థగ్ లైఫ్ తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక కమల్ హాసన్ సొంత బ్యానర్ లో థగ్ లైఫ్ తెరకెక్కుతుండగా, భారీ తారాగణం సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ రంగరాయ శక్తివేల్ నాయకర్ గా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి కమల్ హాసన్ ఫస్ట్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ కాగా, త్వరలో క్రేజీ టీజర్ ని వదలనున్నారు. ఇక థగ్ లైఫ్ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా జయం రవి, శింబు కూడా భాగం అవుతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తవగా, మధ్యలో కీలక నటులు సినిమా నుండి తప్పుకోవడం వల్ల కొన్ని రీ షూట్ కూడా చేయాల్సి వస్తుందట. ఇక ఈ సినిమా షూటింగ్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా పూర్తి చేయాలనీ మణిరత్నం ప్లాన్ చేస్తున్నాడట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు