Harish Shankar: నా దృష్టిలో సినిమా రీమేక్ చేయడమే పెద్ద కష్టం

Harish Shankar: హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో హీరోగా కనిపిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా హరీష్ శంకర్ కెరియర్ లో అతి త్వరగా షూటింగ్ పూర్తి చేసుకుంది అని చెప్పొచ్చు. సినిమా ఎప్పుడు మొదలైంది ఎప్పుడు పూర్తి అయిందో అనుకునే లోపే రిలీజ్ కూడా సిద్ధం అయిపోయింది. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో పాటు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న డబల్ ఇస్మార్ట్ సినిమా కూడా రిలీజ్ సిద్ధంగా ఉంది.

షార్ట్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హరీష్ శంకర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత కొన్నేళ్లు రచయితగా పనిచేసే మిరపకాయ్ సినిమాతో మళ్ళీ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ అనే సినిమాను తెరకెక్కించాడు హరీష్. ఈ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలానే జిగర్తాండ సినిమాను కూడా గద్దల కొండ గణేష్ పేరుతో రీమిక్ చేశాడు. ఈ సినిమా కూడా మంచి హిట్ అయింది.

Harish Shankar

- Advertisement -

అయితే తన కెరియర్ లో రీమేక్ సినిమాలు చేస్తున్నాడు అంటూ హరీష్ శంకర్ ని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీనిపై హరీష్ శంకర్ స్పందిస్తూ మామూలుగా ఒక కొడుకు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు తండ్రి నీకు ఏది వస్తే అది రాయు అని చెప్తున్నప్పుడు ఆ స్టూడెంట్ కి ఎటువంటి భయం ఉండదు వాడు నచ్చింది రాస్తాడు. కానీ రీమేక్ సినిమా అంటే ఎలాంటిది అంటే వాడికి అన్ని మార్క్స్ వచ్చాయి అంటూ కంపారిజన్ మొదలుపెడతారు. నాకు తెలిసి కొత్త సినిమా తీయడం కంటే కూడా రీమేక్ సినిమా తీయడమే నా దృష్టిలో ఎక్కువ రిస్క్ అంటూ చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు