Tamil Rockers : తమిళ్ రాకర్స్ అడ్మిన్ అరెస్ట్… ఎలా పైరసీ చేశారంటే…?

Tamil Rockers : ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాలు పైరసీలు చేయడమనేది రోజూ జరుగుతూనే ఉంది. కానీ దీనికి చిత్ర నిర్మాతలు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఎంత ప్రయత్నించినా కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. పెరిగిన టెక్నాలజీ దృష్ట్యా ఎన్నో రకాలుగా సినిమాలు పైరసీ చేస్తున్నారు. కొంతమంది పెన్ కెమెరాతో కూడా షూట్ చేస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కానీ అప్పుడప్పుడూ కొన్ని పోలీసులు కూడా అలర్ట్ గానే ఉంటారు. తాజాగా తమిళ నాడు, కేరళలో పైరసి సినిమాలు తీసే ప్రముఖ వెబ్ సైట్ తమిళ్ రాకర్స్ అడ్మిన్ ని తాజాగా రాయన్ సినిమా పైరసీ చేస్తుండగా అరెస్టు చేసారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Tamil Rockers admin arrested by police for piracy of Raayan movie

తమిళ్ రాకర్స్ అడ్మిన్ అరెస్ట్…

సౌత్ లో బాగా పాపులర్ అయిన సినిమాల పైరసీ సైట్ అయిన ‘తమిళ్ రాకర్స్’ పైరసి గ్రూప్ అడ్మిన్ అయిన స్టీఫెన్ రాజ్ ని తాజాగా కేరళలో పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులో మదురైకి చెందిన జెఫ్ స్టీఫెన్ రాజ్ అనే వ్యక్తి సౌత్ లో కొత్తగా థియేటర్లలో విడుదలయ్యే అన్ని రకాల సినిమాలను పైరసీ చేసి అక్రమంగా వెబ్సైట్ లలో విడుదల చేస్తున్న ‘తమిళ్ రాకర్స్’ అడ్మిన్ ఇతను. సౌత్ ఇండియా లో ఏ సినిమా అయినా రిలీజ్ అయిన రెండు రోజుల్లో ఆ వెబ్ సైట్ లో పైరసీ చేసి రిలీజ్ చేస్తారు. తాజాగా ధనుష్ నటించిన రాయన్ సినిమాను కూడా అలాగే పైరసీ చేస్తుండగా కేరళ లో పోలీసులు పట్టుకున్నారు.

- Advertisement -

పైరసీ చేస్తుండగా పట్టుకున్న పోలీసులు…

అయితే ధనుష్ నటించిన రాయన్ సినిమాను కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం లోని ఒక థియేటర్లో రాయన్ సినిమాను సెల్ ఫోన్లో రికార్డు చేస్తుండగా ఆదివారం అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇక తమిళ్ రాకర్స్ లో అతనితో పాటు 12 మంది పైరసీలో కలిసి పనిచేస్తున్నట్టు పోలీసుల దర్యా ప్తులో తెలిసింది. అలాగే ఇంతకు ముందు కూడా మలయాళ స్టార్ పృథ్వీ రాజ్ నటించిన ‘గురువాయూర్ అంబలనడైయిల్’ అనే మలయాళ సినిమాను కూడా రెండు నెలల కింద మేలో విడుదలవగా ఆ సినిమాని ఏకంగా మొదటి రోజే తమిళ్ రాకర్స్ వెబ్సైట్లో పెట్టేసారు. అనంతరం పృథ్వీ రాజ్ భార్య సుప్రియ ఫిర్యాదు మేరకు కొచ్చి సైబర్ క్రైం పోలీసులు చర్యలు చేపట్టారు. అయితే తమిళ్ రాకర్స్ వెబ్సైట్ మాత్రమే కాకుండా, టెలిగ్రామ్లో కూడా సినిమాల్ని విడుదల చేస్తున్నట్లు తెలిసింది. ఇక తమిళ్ రాకర్స్ అడ్మిన్ జెఫ్ స్టీఫెన్ రాజ్ ని పోలీసులు అరెస్ట్ చేసి 5 రోజుల కస్టడీకి తీసుకుని పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తమిళ్ రాకర్స్ మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో పైరసీ చేస్తున్న వెబ్ సైట్స్ చాలా ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు