Sonal Chowhan : ఆఫర్లు లేక ఏకంగా వేరే కంట్రీ ఇండస్ట్రీకి వెళ్ళిపోతున్న బాలయ్య బ్యూటీ!

Sonal Chowhan : టాలీవుడ్ లో రెయిన్ బో అనే చిన్న సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ సోనాల్ చౌహన్. ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన ఈ భామ తెలుగు సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమాతో పెద్దగా గుర్తింపు రాకపోయినా, బాలకృష్ణ తో నటించిన లెజెండ్ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత వరుస ఆఫర్లు ఈ అమ్మాయికి క్యూ కట్టాయి. మరీ పెద్ద సినిమాల్లో అవకాశాలు రాకపోయినా, మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో నటించింది. పండగ చేస్కో, డిక్టేటర్ వంటి సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించింది. కానీ ఆ తర్వాత వరుస పరాజయాలతో డౌన్ అయింది ఈ భామ. చివరగా తెలుగులో నాగార్జున ది ఘోస్ట్ సినిమాలో నటించిన ఈ భామ, ఆది పురుష్ లో చిన్న పాత్రలో నటించింది. అయితే ఇప్పటివరకు మళ్ళీ ఎలాంటి ఆఫర్లు రాకపోయే సరికి ఇప్పుడు వేరే ఇండస్ట్రీకి వెళ్ళిపోతుంది సోనాల్.

Sonal Chowhan is doing movie in dollywood industry

వేరే ఇండస్ట్రీకి షిఫ్ట్ అవుతున్న సోనాల్ చౌహన్..

ఇక ఆది పురుష్ త‌ర్వాత ఈ బ్యూటీకి ఆశించిన ఆఫర్లు రానేలేదు. ఈ క్రమంలో వేరే ఇండస్ట్రీలో అవకాశం అందుకుంది. వేరే ఇండస్ట్రీ అనగానే చాలా మంది బాలీవుడ్, లేదా కోలీవుడ్ అనుకోవచ్చు. కానీ ఇవేవి కాదు. అసలు ఆ ఇండస్ట్రీ ఇండియాకి సంబంధించిందే కాదు. సోనాల్ చౌహన్ (Sonal Chowhan) బాంగ్లాదేశ్ కి చెందిన డాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు సినిమా అవకాశం అందుకుంది. బంగ్లాదేశ్ కి చెందిన బెంగాలీ హీరో ష‌కీబ్ ఖాన్ నటిస్తున్న “దర్ద్” అనే సినిమాలో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక అత‌డి స‌ర‌స‌న ఆఫ‌ర్ రాగానే, అసలే అవకాశాలు లేక సతమతమవుతున్న సోనాల్ వెంటనే ఒకే చేసింది.

- Advertisement -

ఇండియాలోనూ సినిమా విడుదల..

ఇక బంగ్లాదేశీ న‌టుడు ష‌కీబ్ ఖాన్ దర్ద్ సినిమాని ఇండియాలో కూడా రిలీజ్ చేస్తున్నాడు. బాంగ్లాదేశ్ లో బెంగాలీ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియాలో కూడా బెంగాలీ భాషలో, అలాగే హిందీలో కూడా దర్థ్ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి అనోన్ మ‌మూన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పయికే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. ఒక‌వేళ ఈ సినిమా బెంగాలీలో మంచి హిట్ అయితే సోనాల్ డాలీవుడ్ కి వెళ్లిపోతుందేమోనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇక్కడ ఇండస్ట్రీలో ఆఫర్లు లేక డల్ అయిన సోనాల్ కి ఇది మంచి అవకాశమే అని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు