Game Changer: ఇద్దరు తగ్గాల్సిందే , ఒకరు సంక్రాంతికి, ఇంకొకరు సెంటిమెంట్ మంత్ కి

Game Changer: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రాబోయే సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్. దాదాపు నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోలేదు. దీనితో పాటుగా తెరకెక్కిన భారతీయుడు సినిమా రిలీజ్ కూడా అయిపోయింది. ఈ సినిమాకి సంబంధించిన భారతీయుడు తిరిగి కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే కొన్ని రోజులు ముందు వరకు గేమ్ చేంజెర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చేవారు కాదు. కానీ రీసెంట్ టైమ్స్ లో మాత్రం గేమ్ చేంజెర్ సినిమా నుంచి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇక రీసెంట్ గా నిర్మాత దిల్ రాజు క్రిస్మస్ కి కలుద్దాం అని అనగానే గేమ్ చేంజర్ సినిమా అప్పుడే వస్తుంది అని అందరూ ఫిక్స్ అయిపోయారు.

భారతీయుడు 2 సినిమా చూసిన తర్వాత ఈ సినిమా మీద ఎవరికీ అంచనాలు లేవు. కానీ ఈ సినిమాకి సంబంధించిన కథ శంకర్ రాయలేదు అనడం కొందరికి ఒక హోప్ ఇచ్చింది. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు కథను అందించాడు. కార్తీక్ మామూలుగా ఒక స్క్రిప్టును రెడీ చేశాడు. అది శంకర్ సార్ రేంజ్ లో ఉందని అనిపించగానే ఆ స్క్రిప్ట్ ని తీసుకెళ్లి శంకర్ కి ఇచ్చేశారు. ఇకపోతే ఈ సినిమా నుంచి ఒక పాట మినహాయిస్తే ఇప్పటివరకు ఎటువంటి కంటెంట్ కూడా రిలీజ్ కాలేదు. అయితే దిల్ రాజు చెప్పినట్లు ఈ సినిమా ఖచ్చితంగా క్రిస్టమస్ కి వచ్చేటట్లు ఉంది.

Thandel

- Advertisement -

ఈ సినిమా క్రిస్టమస్ రిలీజ్ అయితే, ఆల్రెడీ అనౌన్స్ చేసిన తండేలు సినిమా వెనక్కు తగ్గక తప్పదు. అలానే ఈ సినిమాతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ చేస్తున్న రాబిన్ హుడ్ సినిమాను కూడా అదే టైంలో అనౌన్స్ చేశారు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తండెల్ సినిమాను సంక్రాంతి 2025వ సంవత్సరంలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక వెంకి కుడుముల దర్శకత్వంలో నితిన్ చేస్తున్న రాబిన్ హుడ్ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వీరి కాంబినేషన్ లో ఇదివరకే వచ్చిన భీష్మ సినిమా ఫిబ్రవరి నెలలోనే రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు