Tollywood Actors : తెలుగు సినిమాల్లో కొన్ని పాత్రలు హీరోలనే డామినేట్ చేస్తుంటాయి.. విలన్ పాత్రలు, కమెడీయన్ పాత్రలు కొన్ని సినిమాల్లో హైలెట్ గా నిలుస్తున్నాయి. ఆ సినిమాలు మంచి సక్సెస్ ను అందుకోవడంతో వారి పాత్రలకు మంచి మార్కులు పడుతున్నాయి. అలాంటి క్యారెక్టర్స్ ఏంటి? ఏ సినిమాలో ఎవరు నటించారు? సినిమా హిట్ నా లేక ఫట్ నా అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
సునీల్..
సునీల్ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. మొదట్లో కమేడియన్ గా నటించిన కూడా ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు చేసి మంచి టాక్ ను అందుకున్నాడు. ఇప్పుడు విలన్ గా రానిస్తున్నాడు.. సునీల్ క్యారెక్టర్ ప్రతి సినిమాల్లో హీరోను డామినేట్ చేసినట్లు కనిపిస్తుంది. అందులో సొంతం సినిమాలో తానే హీరో అన్నట్లు తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అతని క్యారక్టర్ కు మంచి మార్కులు పడ్డాయి..
అరవిందస్వామి..
ఒకప్పుడు హీరోగా వరుస సినిమాలను చేసి అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు. ఆయన అందానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యేవారు. లేడీ ఫ్యాన్స్ మాత్రం అతనిలాంటి వ్యక్తి భర్తగా రావాలని కోరుకొనేవారు. ఆ తర్వాత కొద్ది రోజులు సినిమాలకు గుడ్ బై చెప్పేసి వ్యాపారాలు చేసుకుంటూ వచ్చాడు.. సినిమాల పై ఇంట్రెస్ట్ తో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం విలన్ గా సినిమాలు చేస్తున్నాడు. ఈయన నటించిన సినిమాల్లో ధ్రువ సినిమాలో హైలెట్ అయ్యాడు.. హీరోను డామినేట్ చేశాడని తెలుస్తుంది..
ఎస్ జే సూర్య..
డైరెక్టర్, నటుడు, విలన్ ఎస్ జే సూర్య పలు సినిమాల్లో నటించి మెప్పించాడు.. మార్క్ ఆంటోని సినిమాలో హీరో విశాల్ కానీ ఎస్జే సూర్య మూవీ మొత్తం డామినేట్ చేశాడు.ఇందులో సూర్య తన నట విశ్వరూపం చూపించాడు.. ఆ సినిమా అతనికి మంచి క్రేజ్ ను అందించింది.. వీళ్లే కాదు ఎంతో మంది యాక్టర్స్ మంచి టాక్ ను సొంతం చేసుకున్నారు.