Director Vijay Bhaskar: సాయి తేజ్ ను పవన్ కళ్యాణ్ లాంచ్ చెయ్యాలి అనుకున్నారు , కానీ అలా మిస్ అయింది

Director Vijay Bhaskar: రేయ్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో మంచి హిట్ అందుకొని హీరోగా నిలబడ్డాడు సాయి ధరం తేజ్. లేకపోతే రేయ్ సినిమా ఆడియో లాంచ్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు నెలకొన్నాయి. అప్పుడు మాట్లాడిన పవన్ కళ్యాణ్ స్పీచ్ కూడా బాగా హైలైట్ అయింది. అయితే ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ సినిమా డిజాస్టర్ కావడంతో కనుమరుగైపోయింది.

వాస్తవానికి ఆ సినిమా సాయి తేజ్ చేయాల్సింది కాదట. ఆ సినిమాను ఆది సాయికుమార్ హీరోగా చేయాల్సిందే. అని కొన్ని కారణాల వలన అది సాయి తేజ్ కి వచ్చింది. స్వయంవరం, చిరునవ్వుతో, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు విజయభాస్కర్. విజయ భాస్కర్ త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చాలా సినిమాలు అద్భుతమైన ఘన విజయాన్ని సాధించాయి. అయితే సాయి తేజ్ హీరోగా విజయ్ భాస్కర్ దర్శకుడుగా ప్రేమ కావాలి అనే సినిమాను చేయాలి అని అనుకున్నారట.

Prema Kavali

- Advertisement -

అయితే వాస్తవానికి సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ కి పవన్ కళ్యాణ్ ప్రొడ్యూస్ చేయాలని ప్లాన్ కూడా వేశారట. పవన్ కళ్యాణ్ నిర్మాతగా విజయభాస్కర్ దర్శకుడుగా సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయం చేయడానికి అప్పట్లో ప్లాన్ చేశారు. అదే ప్రేమ కావాలి సినిమా. కానీ కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమాను ఆది సాయికుమార్ తో తీశాడు విజయభాస్కర్. ఆది సాయికుమార్ చేయాల్సిన రేయ్ సినిమాను సాయి తేజ్ చేశాడు. ఇక్కడ ఆది హిట్టు అందుకున్నాడు. అక్కడ సాయి తేజ్ డిజాస్టర్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆది విషయానికొస్తే ప్రేమకావాలి సినిమా తర్వాత ఇప్పటివరకు సరైన హిట్ సినిమా ఒకటి పడలేదు.

Rey Movie

ఇక సాయి తేజ్ తో రేయ్ సినిమాను చేసిన వై వి ఎస్ చౌదరి ఇప్పటివరకు మరో సినిమాకి దర్శకత్వం వహించలేదు. ఇప్పుడు మళ్లీ నందమూరి వారసుడిని పరిచయం చేసే పనిలో పడ్డాడు వైవిఎస్ చౌదరి. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో మహేష్ బాబు, రామ్ పోతినేని, సాయి తేజ్ వంటి హీరోలు డెబ్యూ చేశారు. వీళ్లలో రామ్ పోతినేని తో చేసిన దేవదాస్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక సాయితేజ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ నిర్మాతగా సినిమా చేయకపోయినా కూడా పవన్ కళ్యాణ్ తో కలిసిన నటించే అవకాశాన్ని పొందుకున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు