Allu Arjun: బన్నీకి కూడా సర్జరీలు తప్పలేదా.. డాక్టర్ ఏమన్నారంటే..?

Allu Arjun.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ఆయన రేంజ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో పాన్ ఇండియా హీరో అవ్వడమే కాదు ఏకంగా జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా కూడా రికార్డు సొంతం చేసుకున్నారు ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా మారిపోతున్న నేపథ్యంలో ఈయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Allu Arjun: Bunny also needs surgeries.. What is the doctor saying..?
Allu Arjun: Bunny also needs surgeries.. What is the doctor saying..?

అల్లు Vs మెగా..

ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికలలో చోటు చేసుకున్న పరిణామాలు మెగా వెర్సెస్ అల్లు అన్నట్టుగా మారిపోయింది. చాలావరకు మెగా అభిమానులు అల్లు అర్జున్ ను ఏకిపారేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వలేదని, వైసిపి అభ్యర్థికి సపోర్టుగా నిలిచిన నేపథ్యంలో చాలామంది అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్లు మెగా – అల్లు కుటుంబాల మధ్య గొడవలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే బన్నీకి సంబంధించిన ఒక విషయాన్ని పదే పదే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు కొంతమంది యాంటీ ఫ్యాన్స్. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సర్జరీ చేయించుకున్న అల్లు అర్జున్..

సాధారణంగా అందంగా కనిపించడం కోసం అమ్మాయిలు సర్జరీలు చేయించుకుంటున్న విషయం తెలిసిందే. ప్రత్యేకంగా హీరోయిన్లు కూడా తమ శరీరంలో పలు భాగాలకు సర్జరీ చేయించుకుని మరింత అందంగా తయారవుతున్నారు. అయితే ఇప్పుడు హీరోలు కూడా సర్జరీలు చేయించుకుంటున్నారు.. కానీ హీరోయిన్లు ప్రజెంట్ అయినట్టుగా హీరోలను పెద్దగా పట్టించుకోరు అనే చెప్పాలి. కానీ ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ కూడా సర్జరీ చేయించుకున్నారు అంటూ ఈ విషయంపై డాక్టర్ క్లారిటీ ఇచ్చినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అంతేకాదు చాలామంది నటీనటులు కచ్చితంగా ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని ఉంటారంటూ ప్రముఖ కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ గొల్లు కూడా తెలిపారు.

- Advertisement -

డాక్టర్ క్లారిటీ..

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో పలువురు స్టార్స్ కి అందించిన అప్పటి ఇప్పటి ఫోటోలు చూపిస్తూ వీరు సర్జరీ చేయించారా.? అంటూ యాంకర్ అనగా.. దీనికి చాలా క్లియర్ గా ఆన్సర్ ఇచ్చారు డాక్టర్ రాజశేఖర్.. ముందుగా హీరో దుల్కర్ సల్మాన్ ఫోటో చూపించగా, ఆయన ముక్కుకి కచ్చితంగా రైనో ప్లాస్టీ చేయించారంటూ క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత దీపిక పదుకొనే కూడా ముక్కుకు సర్జరీ చేయించిందని తెలిపారు. అలాగే అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలో ఫోటో ఇప్పటి లేటెస్ట్ ఫోటో చూపించి అడగగా, దీనికి కూడా ఆయన సమాధానం తెలిపారు. అల్లు అర్జున్ ముక్కుకి సర్జరీ చేయించారని బాగా తెలుస్తోంది. అలాగే లిప్స్ కూడా తెలిసిపోతుంది. ముక్కు పెదవులు మాత్రం కచ్చితంగా సర్జరీ చేయించుకున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. నా అవగాహన ప్రకారం ఇది కచ్చితంగా సర్జరీ అయి ఉండవచ్చు అంటూ తెలిపారు డాక్టర్. అంతేకాదు ఫేమస్ అయిన వారి సెలబ్రిటీలను కూడా ఇందులో చూపించడం జరిగింది. అయితే తన వద్దకు వచ్చిన వారికి కూడా సర్జరీలు, ఫిల్లర్ ట్రీట్మెంట్ ఇచ్చామని తెలిపారు. అయితే డాక్టర్ రాజశేఖర్ ఇంతమంది గురించి చెప్పగా కేవలం బన్నీ వీడియోని మాత్రమే కట్ చేసి యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు