Raayan 1St weekend collections: ధనుష్ ఖాతాలో హిట్.. దుమ్ము దులిపేస్తున్న కలెక్షన్స్..!

Raayan 1st weekend collections.. నటుడుగానే కాకుండా దర్శకుడిగా కూడా సత్తా చాటుతున్న అతి కొద్ది మంది నటులలో కోలీవుడ్ స్టార్ హీరో, జాతీయ ఉత్తమ నటుడు ధనుష్ కూడా ఒకరు. తాజాగా ఈయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం రాయన్. గత శుక్రవారం విడుదలై మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. తెలుగులో ఈ సినిమా విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే రూ.3.69 కోట్లు షేర్ వసూలు చేయగా, రూ.7.05 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమా రూ.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రూ.5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా.. ఈ సినిమా ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం రూ.1.8 కోట్లు రాబడితే చాలు హిట్ అయినట్లే. మరి ఈ సినిమాకు వచ్చిన టాక్ తో ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసి హిట్ గా నిలుస్తుందని అభిమానులు సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Raayan 1st weekend collections: Hit on Dhanush's account.. Collections blowing dust..!
Raayan 1st weekend collections: Hit on Dhanush’s account.. Collections blowing dust..!

వారాంతంలోనే బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు..

మొదటి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసింది అనే విషయానికొస్తే.. తమిళనాడులో రూ.34.95 కోట్ల గ్రాస్ వసూలు చేయగా తెలుగు రాష్ట్రాలలో రూ.7.05 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అలాగే కర్ణాటకలో రూ.5.25 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. కేరళలో రూ.2.90 కోట్ల గ్రాస్, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని రూ.1.75 కోట్ల గ్రాస్ వసూల్ రాబట్టింది. ఓవర్సీస్ లో అన్ని భాషల్లో కలుపుకొని ఏకంగా రూ .20.75 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టినట్లు బాక్సాఫీస్ రిపోర్ట్స్ స్పష్టం చేశాయి.

ఫస్ట్ వీకెండ్ లో రూ.34.75 కోట్లు..

ఇకపోతే మొత్తంగా మొదటి వీకెండ్ లో అంటే మూడు రోజుల్లోనే ఏకంగా రూ.72.65 కోట్ల గ్రాస్ , రూ.34.75 కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా రూ.46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది. ఇక కేవలం మూడు రోజుల్లోనే రూ.34.75 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా హిట్ అనిపించుకోవాలంటే కేవలం రూ.11.25 కోట్లు రాబడితే చాలు ఈ సినిమా హిట్ అయినట్లే.. మొత్తానికి అయితే ఈ సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు. రాయన్ మూవీ కి వచ్చిన టాక్ ను బట్టి చూస్తే ఈ సినిమా టార్గెట్ అందుకోవడానికి ఇంకొన్ని రోజుల సమయం మాత్రమే పడుతుందనీ చెప్పవచ్చు. ఇకపోతే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ధనుష్ కు ఏ మేరకు లాభాలను తీసుకొస్తుందో చూడాలి. ఇక ప్రస్తుతం తెలుగు , తమిళంలో బైలింగ్వల్ మూవీ కుబేర సినిమాలో నటిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు