Prabhas: రాజా సాబ్ గ్లిమ్స్ వచ్చేసింది, ప్రభాస్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్, ఫ్యాన్స్ కోరుకుంది ఇదే

Prabhas: కేవలం తెలుగులోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ప్రభాస్ కి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చింది. ఆ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత ప్రభాస్ ఇప్పటివరకు ఒక్క ఎంటర్టైన్మెంట్ సినిమా కూడా చేయలేదు. కానీ చాలామంది ప్రేక్షకులకి అభిమానులకి ప్రభాస్ లోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ చాలా ఇష్టం. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, డార్లింగ్ వంటి సినిమాలు చూసి ప్రభాస్ ని ఇష్టపడిన ఆడియన్స్ ఎంతోమంది ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చిన తర్వాత ప్రభాస్ ఈ కైండ్ ఆఫ్ సినిమాలు చేయడం మానేశాడు.

అయితే ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ మిస్ అయిన ఫ్యాన్స్ కి ఎట్టకేలకు దర్శకుడు మారుతీ రూపంలో విముక్తి కలిగింది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ రాజా సాబ్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాని పీపుల్ మీడియా సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. లేకపోతే రీసెంట్ గా ఈ సినిమా గురించి ఒక అప్డేట్ కూడా బయటకు రాలేదు. ఇక ఈ తరుణంలో కల్కి సినిమా సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కి మరో అప్డేట్ ఇచ్చారు. రాజా సాబ్ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Prabhas

- Advertisement -

ప్రభాస్ నుంచి అభిమానులు ఏదైతే మిస్ అయ్యారో దానినే ఈ గ్లిమ్స్ చూపించాడు మారుతి. ఈ గ్లిమ్స్ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు. ఈ గ్లిమ్స్ లో బైక్ పై ప్రభాస్ ఎంట్రీ ఇవ్వడం. అద్దంలో చూసుకుని తనకు తాను మురిసిపోతూ పూలు జల్లుకోవడం చూస్తుంటే వింటేజ్ ప్రభాస్ విట్నెస్ చేయొచ్చు. ఇప్పుడు నుంచో ప్రభాస్ అభిమానులు వెయిట్ చేస్తున్న రోజులకు నేటితో మారుతి కొంత చెక్ పెట్టాడు. ముఖ్యంగా ఈ సినిమాకి తమన్ అందిస్తున్న మ్యూజిక్ పెద్ద ప్లస్ అవ్వనుంది అని ఈ గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా 2025 ఏప్రిల్ నెలలో రిలీజ్ కానుంది

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు