KA: కేరళలో కిరణ్ అబ్బవరం పెళ్లి, ఎప్పుడంటే.?

KA: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన చాలామంది నటులు హీరోలుగా నిలబడ్డారు. ప్రస్తుత కాలంలో నాని రవితేజ వంటి చాలామంది హీరోలు చాలామందికి ఇన్స్పిరేషన్ గా మారారు. ఇక రీసెంట్ టైమ్స్ లో కూడా చాలామంది యంగ్ హీరోస్ స్వయంగా పైకి వచ్చారు. వారిలో విజయ్ దేవరకొండ, నిఖిల్, తేజ సజ్జ, విశ్వక్సేన్ వంటి ఎంతోమంది హీరోలు ఉన్నారు. అయితే అందరూ చాలా పద్ధతిగా సినిమాలు ప్లాన్ చేసుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్తున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని వ్యక్తుల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఒక హిట్ సినిమా పడింది అంటే అవకాశాల వరుసగా వెతుక్కుంటూ వస్తాయి.

రాజా వారు రాణి గారు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. తను హీరో అవ్వడానికంటే ముందు చాలా షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించిన రాజా వారు రాణి గారు సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన హిట్స్ సాధించింది. ఆ తర్వాత కిరణ్ కి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత చేసిన సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా అద్భుతమైన హిట్గా నిలిచింది. ఈ సినిమాలో కేవలం నటించడమే కాకుండా తనలోని రైటర్ టాలెంట్ ని కూడా బయటికి తీసాడు కిరణ్.

Kiran Abbavaram, Rahasya Gorak engaged

- Advertisement -

ఇకపోతే రాజావారు రాణి గారు సినిమాలో కిరణ్ తో పాటు జంటగా కనిపించింది రహస్య గోరక్. ఆ సినిమాలో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అయింది. ఆ జంటను కూడా చాలా అద్భుతంగా చూపించాడు దర్శకుడు రవికిరణ్ కోలా. కిరణ్ అబ్బవరం గురించి అందరికీ తెలిసిందే రీసెంట్ గానే రహస్య గోరక్ తో ప్రేమలో ఉన్నట్లు తెలియడమే కాకుండా వీరిద్దరూ కలిసి అధికారికంగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇకపోతే వీరిద్దరూ ఆగస్టు 22న పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ పెళ్లి కేరళలో జరగనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు