Prabhas: డార్లింగ్ ఇంటిని చూసారా.. కళ్ళు బయర్లుకమ్మాల్సిందే..!

Prabhas.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా చలామణి అవుతున్నారు. ముఖ్యంగా తన సినిమాలు ఫ్లాప్ అయినా సరే రూ.100 కోట్లు కొల్లగొడుతూ రికార్డు సృష్టిస్తున్నాయి. దాదాపు రూ.100 కోట్లు పైగానే పారితోషకం తీసుకుంటున్నారు కూడా. ఎప్పుడు కూడా ప్రభాస్ సినిమాల గురించి వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఆయన వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటాడు? తన లైఫ్ స్టైల్ ఏంటి? ఏం తింటాడు? ఎక్కడ ఉంటాడు? అనే విషయాలు మాత్రం చాలా మందికి తెలియదనే చెప్పాలి. ఈ విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు.

Prabhas: Have you seen Darling's house.. Eyes wide open..!
Prabhas: Have you seen Darling’s house.. Eyes wide open..!

ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న ప్రభాస్ ఇల్లు..

రీసెంట్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898AD సినిమా చేసి ఏకంగా రూ.1000 కోట్ల క్లబ్లో చేరిపోయారు. బాహుబలి 2 తర్వాత ఈయన నటించిన కల్కి సినిమా ఈ ఫీట్ అందుకోవడం నిజంగా విశేషం అనే చెప్పాలి. ఇకపోతే ఎప్పుడు ప్రభాస్ సినిమాలు విడుదల అవుతాయి..? ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అనే విషయాలు పక్కన పెడితే , ఆయన ఉంటున్న ఇల్లు చూస్తే మాత్రం నిజంగా కళ్ళు బయర్లు కమ్ముతాయి. ప్రభాస్ ఇల్లు ఒక ఇంద్ర భవనంలా ఉంటుంది. లోపల వివిధ దేశాలకు చెందిన టైల్స్ తో చేసిన ఫ్లోరింగ్, స్విమ్మింగ్ పూల్ వంటివి చూస్తే మాత్రం మతి తిప్పుకోలేరు. స్విమ్మింగ్ పూల్ ఆరు బయట కాకుండా ఇక్కడ లోపల రహస్యంగా ఏర్పాటు చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

ఆ ఇంటి మెయింటెనెన్స్ కోసం నెలకి రూ.10 లక్షలు..

ముఖ్యంగా ఇంటి ఆవరణలో ఉండే గార్డెనింగ్ కూడా చూపరులను బాగా ఆకట్టుకుంటుంది. ఈయన ఇల్లు హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44 , సిబిఐ కాలనీలో ఉంటుంది. ఈ ఇంటిని మెయింటైన్ చేయడానికి నెలకు రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందట. దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే హైదరాబాదు జూబ్లీహిల్స్ లోనే కాదు గండిపేటలో కూడా ఒక గెస్ట్ హౌస్ వుంది. దాంతో పాటు సొంత ఊర్లో తాతల కాలం నాటి ఇంద్ర భవనం కూడా ఉందని సమాచారం. దీంతో పాటు బెంగళూరు , చెన్నై, ముంబై వంటి ప్రదేశాలలో వేలకోట్ల విలువ చేసే ఇల్లు కూడా ఉన్నాయి.

- Advertisement -

అన్నదాత కూడా..

ఆస్తుల విషయంలోనే కాదు, ఆకలి వేసిన వారికి అన్నం పెట్టడంలో కూడా అన్నదాతగా పేరు సొంతం చేసుకున్నారు. తన ఇంట్లో ప్రభాస్ ఉన్నా లేకపోయినా రోజూ ఒక 50 మందికి వంట వండుతారట. దానిని ప్రభాస్ సన్నిహితులకు పంపిస్తారట. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి రెండో చేతికి కూడా తెలియకుండా సహాయం చేస్తారట ప్రభాస్.. సాధారణంగా ప్రభాస్ అంటే ఇతరులకు అన్నం పెట్టడంలో రారాజు అంటారు.. కానీ ఆయన సహాయం చేయడంలో కూడా అంతకుమించి అనడంలో సందేహం లేదు .కాకపోతే చేసే సహాయం బయటకు రాకపోవడం వల్లే ఈ విషయాలు ఎవరికీ తెలియదని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు