Indian2 : ఇక మూడో పార్ట్ కి మొత్తం రిపేర్లు చేస్తున్నారట..

Indian2 : కమల్ హాసన్ – శంకర్ షణ్ముగం కాంబినేషన్ లో తెరకెక్కిన ఇండియన్2 సినిమా ఎట్టకేలకు నాలుగేళ్ళ తర్వాత జులై 12న థియేటర్లలో విడుదలైంది. నిజానికి సినిమాపై పెద్దగా అంచనాలు లేకున్నా, కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ కాబట్టి ప్రేక్షకులు ఎంతో ఊహించారు. కానీ థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు శంకర్. ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. థియేటర్లలో ఇండియన్ తాతని చుసిన ప్రేక్షకులు విసుగు చెందారు. ల్యాగ్ ఎక్కువైందని బోరింగ్ స్క్రీన్ ప్లే తో సాగదీశారని, సినిమాని ఓవరాల్ గా ప్లాప్ చేసేసారు. ఇప్పటికే థియేటర్లలోంచి ఇండియన్ 2 ని దాదాపుగా తీసేసారు. ఇదిలా ఉండగా సినిమాలో చివర్లో ఇండియన్3 ట్రైలర్ రిలీజ్ చేసి మూడో పార్ట్ పై మాత్రం అంచనాలు పెంచేశారు.

Shankar is reshooting the movie Indian3 due to the result of Indian2

మొత్తం రిపేర్లు చేస్తున్నారా?

అయితే ఇండియన్2 (Indian2) సినిమా పూర్తయ్యాక చివర్లో మూడో భాగం ట్రైలర్ ని రిలీజ్ చేసి అంచనాలు పెంచేసాడు. కానీ ఇండియన్2 ఫలితం తో మరింత జాగ్రత్త పడుతున్నారట మేకర్స్. మూడో పార్ట్ లాభాలు తేకపోయినా, కనీసం నష్టాలు పూడ్చగలిగేలా ఉండాలని నిర్మాతలు భావిస్తున్నారట. అందుకే ఇప్పటికే మూడో పార్ట్ షూటింగ్ పూర్తయిన ఇండియన్3 సినిమాని మొత్తం రిపేర్లు చేస్తున్నారట. మూడో పార్ట్ కూడా దాదాపు మూడు గంటల నిడివితో ఉండగా, అందులోని చాలా సీన్లు ట్రిమ్ చేసే అవకాశం ఉండగా, కొన్ని సన్నివేశాలని మళ్ళీ రీషూట్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారట. ఇక శంకర్ గేమ్ ఛేంజర్ పనుల్లో బిజీగా ఉన్నా, ఇండియన్3 సినిమా స్క్రిప్ట్ డెవలెప్మెంట్ పై మరోసారి ఆలోచిస్తున్నాడని సమాచారం.

- Advertisement -

నెక్స్ట్ సమ్మర్ లో ప్లాన్…

ఇక ప్రస్తుతం శంకర్ గేమ్ ఛేంజర్ ప్రమోషన్లకి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఇయర్ డిసెంబర్ లో క్రిస్మస్ కి రానుందని దిల్ రాజు ప్రకటించగా, ఒకవేళ వాయిదా పడితే వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చికి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇకపోతే ఇండియన్3 ని చాలా భాగం రీషూట్లు చేసి, మొత్తం రిపేర్లు చేసి ఫ్రెష్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. 2025 సమ్మర్ లో మే నెలలో ఇండియన్3 ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా గేమ్ ఛేంజర్ రిలీజ్ తర్వాతే శంకర్ ఫోకస్ పూర్తిగా ఇండియన్3 కి షిఫ్ట్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు