Toofan : ఈ హీరోని అసలు పట్టించుకొవట్లేదుగా? ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు..

Toofan : కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిచ్చగాడు సినిమాతో తెలుగులో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు ఈ హీరో. ఆ సినిమా రిలీజ్ వరకు విజయ్ ఆంటోనీ ఎవరో కూడా చాలామందికి తెలీదు. మహా అయితే సినిమాలు రెగ్యులర్ గా చూసే ఆడియన్స్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం. బిచ్చగాడు సినిమా వచ్చాక సౌత్ మొత్తం మంచి క్రేజ్ ని సంపాదించాడు. ఆ సినిమా తెలుగులో ఏకంగా పాతిక కోట్లు వసూలు చేయడం విశేషం. ఇప్పటికి టెలివిజన్ స్ట్రీమింగ్ అయినా అదిరిపోయే టిఆర్పి రేటింగ్స్ ని తెచ్చుకుంటుంది ఆ సినిమా. అయితే అంత భారీ హిట్ కొట్టిన తర్వాత ఈ హీరోకి ఆ రేంజ్ సక్సెస్ మళ్ళీ రాలేదు. లాస్ట్ ఇయర్ బిచ్చగాడు2 సీక్వెల్ తోనే మరో సక్సెస్ వచ్చింది. కానీ మళ్ళీ పాత కథే మొదలైంది.

Vijay Antony starrer Toofan movie will release on August 2

తూఫాన్ ని పట్టించుకోవట్లేదుగా..

ఇక బిచ్చగాడు సీక్వెల్ తో కం బ్యాక్ ఇచ్చాడు అనుకునే లోపే మళ్ళీ విజయ్ కి వరుస పరాజయాలు ఎదురయ్యాయి. కొలాయ్, రక్తం, రోమియో సినిమాలతో ప్లాప్ అందుకున్నాడు. బిచ్చగాడు కి దానికి సీక్వెల్ కి మధ్యలో ఏకంగా పది ప్లాప్ లు ఉన్నాయంటే అర్ధం చేసుకోవచ్చు ఈ హీరో మార్కెట్ ఎంత పడిపోయిందో. దానికి స్క్రిప్ట్ సెలక్షనే కారణం అని తెలుస్తుంది. తన పాత్ర వరకు విజయ్ మెప్పించినా, రొటీన్ స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలతో ఆడియన్స్ నిరాశ చెందుతున్నారు. ఇక లేటెస్ట్ గా తూఫాన్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. కానీ ఈ సినిమా వస్తున్నట్టు కూడా జనాలకి తెలీని పరిస్థితి ఎదురయింది.

- Advertisement -

కంటెంట్ పైనే భారం!

విజయ్ ఆంటోనీ నటించిన తుఫాన్ సినిమా ఆగస్ట్ 2న తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతుంది. కానీ ఈ సినిమా వస్తుందని కూడా సాధారణ ప్రేక్షకులకి చాలామందికి తెలీదు. తెలుగులో అయితే మూవీ లవర్స్ పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక తమిళ్ లో అయితే రాయన్ ఊపు వల్ల, ఈ వారం వస్తున్న తూఫాన్ ని ప్రేక్షకులు లెక్క చెయ్యట్లేదు. ఇక సినిమా కంటెంట్ బాగుండి, మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటేనే ప్రేక్షకులు థియేటర్లకు రావచ్చు. లేదంటే విజయ్ కి మరో ప్లాప్ పడినట్టే అని అంటున్నారు నెటిజన్లు. పైగా చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్ల లో వెనుకబడ్డారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శరత్ కుమార్, సత్యరాజ్, మురళి శర్మ పెద్ద నటులు ఉన్నా లాభం లేకపోయింది. ఏది ఏమైనా కంటెంట్ బాగుంటే, ఉన్న సినిమాల పోటీని తట్టుకుని ఎంతవరకు నిలబడుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు