Balagam : ‘ బలగం ‘ లచ్చవ్వ గురించి ఇన్నాళ్లకు బయటకొచ్చిన నిజం.. కన్నీళ్లు ఆగవు..

Balagam : సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాల కన్నా ఎక్కువగా ఎటువంటి అంచనాలు లేకుండా వస్తున్న చిన్న సినిమాలే మంచి హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. అందులో బలగం సినిమా కూడా ఒకటి.. త్రిపుల్ ఆర్ తర్వాత వచ్చిన ఈ సినిమాకు మంచి క్రేజ్ లభించింది.. కేవలం కాకిని హైలెట్ చేస్తూ వచ్చిన కుటుంబకథా చిత్రం.. గుండెల్ని పిండిసే ఈ సినిమా గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచంలోని తెలుగువారంతా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తీసిన డైరెక్టర్ వేణుతో పాటు ఇందులో నటించిన వారు ఫేమస్ అయ్యారు.. ఈ సినిమా లచ్చవ్వ పాత్రకు ఎంత పేరు వచ్చిందో చూశాం.. ఆమె రియల్ లైఫ్ లో ఎన్ని కష్టాలు ఎదుర్కొందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న తర్వాత ఇందులో నటించిన నటులంతా కూడా పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సినిమాలోని ప్రతీ క్యారెక్టర్ ఇంపార్టెంటే. అందుకే ఇందులో హీరో, హీరోయిన్ కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులకు సరైన గుర్తింపు లభించింది. ఈ సినిమాలో చనిపోయిన కొమురయ్య కూతురుగా లచ్చవ్వ పాత్రకు మరింత గుర్తింపు వచ్చింది.. సినిమాకు ఆమె ఒకరకంగా హైలెట్ అని చెప్పాలి.. ఆమె గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Unbelievable facts about Balagam actor Roopa Lakshmi
Unbelievable facts about Balagam actor Roopa Lakshmi

అచ్చం సొంత బిడ్డలాగే నటించిన ఈమె ఏడ్వడం చూసి కన్నీళ్లు పెట్టుకోని మహళ లేరనే చెప్పొచ్చు. అయితే ఇంతకీ ఈ లచ్చవ్వ పాత్రలో నటించిన అమె పేరు రూపలక్ష్మి. ముందుగా సీరియల్ లో నటంచిన ఆమె ఆ తరువాత 2018లో ‘నీది నాది ఒకే కథ’ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత కొన్ని సినిమాలో నటించినా గుర్తింపు రాలేదు. అయితే ‘బలగం’ ద్వారా ఆమె ఫేమస్ అయ్యారు. ఈమె రియల్ లైఫ్ గురించి వింటే కన్నీళ్లు ఆగవు.. ఈమె ఒకరైతు కుటుంబంలో పుట్టింది.. ఎందుకో తెలియదు కానీ ఆమెను వేరే వాళ్లకు దత్తత ఇచ్చారట.. అక్కడ తండ్రీ తప్ప వెరెవ్వరు సరిగ్గా ఉండేవారు కారని చెప్పింది..

- Advertisement -

ఇక చదువు కూడా పెద్దగా చదువుకోలేదని, నటన వైపు ఇంట్రెస్ట్ ఉండటంతో ఇటు వచ్చినట్లు చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం తనకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు, భర్తతో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.. అందరూ ఉన్నా అనాధగా పెరిగినట్లు ఆమె చెప్పింది.. ఈమె కథను విన్న చాలా మంది బాధపడ్డారు.. తన అందం, అభినయం తో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.. ఎన్ని బాధలు పడితేనే ప్రశంసలు దక్కుతాయి అనడానికి ఈమె జీవితం ఉదాహరణ గా చెప్పొచ్చు.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు