Double Ishmart : చార్మీ ఈ గొడవలు ఆపగలదా.. లేదంటే 15 కోట్లు చెల్లిస్తుందా..

Double Ishmart : ప్రస్తుతం అందరి ఫోకస్ ఆగష్టు 15 న విడుదల కాబోతున్న సినిమాలపైనే ఉంది.. అందులో ఎక్కువగా మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ పై జనాల్లో ఆసక్తి కాస్త ఎక్కువగా ఉంది. అయితే డబుల్ ఇస్మార్ట్ చుట్టు కొన్ని వివాదాలు చుట్టుముట్టాయని తెలుస్తుంది. ఈ సినిమా విడుదలపై రోజుకో వార్త బయటకు వస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా మరో వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ఈ సినిమా బిజినెస్ డిటైల్స్ మేకర్స్ ను టెన్షన్ పెట్టిస్తున్నాయి. అందులో లైగర్ సినిమా భాధితులు మొత్తం ఫిలిం నగర్లో మీటింగ్ పెట్టినట్లు తెలుస్తుంది.. ఆ మీటింగ్ లో ఏం చర్చించారో ఇప్పుడు తెలుసుకుందాం..

గతంలో ఛార్మి కౌర్, పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో తీసిన సినిమా లైగర్.. భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమాగా విడుదల అయ్యింది. ఆ సినిమా ఓపెనింగ్స్ బాగానే ఉన్నా కూడా కలెక్షన్స్ దెబ్బేసిన విషయం తెలిసిందే.. ఆ సినిమాకు సరిగ్గా పెట్టిన ఖర్చులు కూడా వెనక్కి రాలేదు.. తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని సినిమాను కొన్న డిస్టిబ్యూటర్స్ గత కొన్ని నెలలుగా గొడవలు చేస్తున్నారు.. అయితే నష్టాన్ని కాస్తైనా భరించాలంటూ పూరీని ఆఫీస్ ముందు గొడవకు దిగారు..

Once again the Ligar distributors arranged a meeting in the film chamber
Once again the Ligar distributors arranged a meeting in the film chamber

ఈ వివాదం ఫిల్మ ఛాంబర్ ముందుకు పోవడంతో.. తాజాగా ఛాంబర్‌ పూరీకి మద్దతుగా నిలిచింది. నైఙాం ఏరియాలో ఎవ్వరికీ రూపాయి ఇవ్వనవసరం లేదంటూ పూరి కనెక్ట్ కు క్లారిటీగా లెటర్ ఇచ్చేసింది.. అయినా ఈ గొడవలు తగ్గినట్లు కనిపించలేదు.. తాజాగా మరోసారి ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ జరిగింది. చార్మీ ఈ గొడవల పై చర్చలు జరిపినట్లు తెలుస్తుంది.. ఒకవైపు వీరికి మద్దతుగా తీర్పు వచ్చినా కూడా డిస్టిబ్యూటర్స్ గొడవలు ఆపడం లేదని తెలుస్తుంది.. మరి చార్మీ వారి కోరిక మేరకు 15 కోట్లు చెల్లిస్తుందా లేదా చూడాలి.. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమాకే జీఎస్టీ చెల్లించడానికి డబ్బులు లేవు.. మరి వాళ్లకు ఇవ్వడం కష్టమే.. దీనిపై చార్మీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు