Bhagyasri Borse : నక్క తోక తొక్కింది బ్రో.. ‘Mr. Bachchan’ సినిమాకు భాగ్యశ్రీ బోర్సే రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?

Bhagyasri Borse : టాలీవుడ్ లోకి కొత్త ముద్దుగుమ్మలు వస్తూనే ఉన్నారు. మొదటి సినిమాతోనే కొందరు హిట్ టాక్ ను అందుకుంటే మరికొందరు మాత్రం ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో కనిపించకుండా మాయం అవుతున్నారు. ఆ లిస్ట్ లోకి తాజాగా ఓ కుర్ర బ్యూటీ చేరింది. రవితేజతో ప్రస్తుతం జోడి కట్టింది.. త్వరలోనే ఆమె నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆమె ఎవరో కాదు భాగ్యశ్రీ బోర్సే.. ఈ అమ్మడు బాలీవుడ్ బ్యూటీ.. ఇదే మొదటి సినిమా.. ఈ సినిమాకు హరీష్ శంకర్ ఎంత రెమ్యూనరేషన్ కు ఒప్పించాడో అనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ పాప ఈ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రవితేజ నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.. ఈ సినిమాకు ఈ అమ్మడు తీసుకొనే రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ అయింది.. ఈ సినిమాకు గాను ఈమె రూ. కోటి లోపే తీసుకుంటుందని టాక్.. ఈ మూవీలో రెండు, మూడు సార్లు లంగాహోణిలో కనిపిస్తుంది. అలాగే రెండు పాటల్లో కనిపిస్తుంది.. దానికే అంత ఇస్తున్నారా? అని ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. కొత్తగా ఎంట్రీ ఇస్తున్న ఈమెకు ఇంత ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి.. సినిమా వస్తే గానీ ఆమె పెర్ఫార్మన్స్ ఎలా ఉండనేది తెలియదు. మిస్టర్ బచ్చన్ సినిమా ఆగష్టు 15 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది..

Do you know Bhagyashree Borse's remuneration for Mr. Bachchan's movie?
Do you know Bhagyashree Borse’s remuneration for Mr. Bachchan’s movie?

ఇకపోతే ఈ సినిమా చేస్తుండగానే వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంటూ వస్తుంది.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా కావడం విశేషం.. ఆ తర్వాత నాని, సుజిత్ కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. అలాగే దుల్కర్ సల్మాన్ సినిమాలో నటిస్తుంది. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇకపోతే సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. ట్రెండీ వేర్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు