25 years for Rajakumarudu: సినిమా వెనుక ఇంత కథ నడిచిందా.. నాటి సీఎం కూడా..!

25 years for Rajakumarudu.. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్ బాబు తొలిసారి హీరోగా మేకప్ వేసుకున్న చిత్రం రాజకుమారుడు. నేటితో ఈ సినిమా 25 వసంతాలు పూర్తి చేసుకుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన చిత్రం 1999 జూలై 30వ తేదీన విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో మహేష్ బాబు హీరోగా, ప్రీతిజింతా హీరోయిన్ గా రాఘవేందర్రావు దర్శకత్వంలో, మణి శర్మ సంగీత సారథ్యంలో సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

25 years for Rajakumarudu: Is there a story behind the movie.. Even the then CM..!
25 years for Rajakumarudu: Is there a story behind the movie.. Even the then CM..!

రాజకుమారుడు కోసం సీఎం చంద్రబాబు నాయుడు..

మహేష్ బాబు తన తండ్రి కృష్ణతో కలిసి దాదాపు తొమ్మిది చిత్రాలలో బాల నటుడి గా నటించారు.. 1990లో వచ్చిన బాలచంద్రుడు తర్వాత చదువుపై దృష్టి పెట్టడంతో మళ్లీ సినిమాలు చేయలేదు. ఈ క్రమంలోనే యమలీల కథను ఎస్వీ కృష్ణారెడ్డి వినిపించారు.. కృష్ణ కి కూడా నచ్చడంతో రెండేళ్లు ఆగమని చెప్పారు కృష్ణ.. అయితే ఆలస్యం అవ్వడంతో అలీ హీరోగా ఆ మూవీ రావడం సూపర్ హిట్ కావడం అన్ని జరిగిపోయాయి. ఆ తర్వాత వరుసగా కథలు వినడం మొదలుపెట్టారు కృష్ణ.. ఈ క్రమంలోని పరుచూరి బ్రదర్స్ చెప్పిన కథ బాగా నచ్చింది.. సామాన్య కథను సైతం తన టేకింగ్ తో అద్భుతంగా మార్చగల దర్శకుడు రాఘవేందర్రావు.. కృష్ణకి కూడా మంచి విజయాలు అందించారు.. దీంతో మహేష్ బాబు తొలిచిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతను రాఘవేంద్రరావు పై పెట్టారు.. అలాగే మహేష్ తొలి చిత్రాన్ని నిర్మించే బాధ్యతను వైజయంతి మూవీస్ కి అప్పగించారు. ముఖ్యంగా కథకు కావలసిన రిచ్ నెస్ కోసం ఏమాత్రం వెనుకాడకుండా ఖర్చు చేసే సంస్థ వైజయంతి మూవీస్.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ముహూర్త సన్నివేశానికి అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి క్లాప్ ఇవ్వడం విశేషం.

44 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్షితం..

78 ప్రింట్లతో 116 స్క్రీన్ లలో రాజకుమారుడు సినిమా విడుదలయ్యింది నెమ్మదిగా పాజిటివ్ టాక్ తెచ్చుకొని 100 రోజులు విజయవంతంగా ప్రదర్శనమైంది.. 44 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రూ.10 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రంగా నంది అవార్డు లభించింది. ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ గా శ్రీనివాసరావు అవార్డును అందుకున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సన్నివేశాన్ని ఒకానొక సందర్భంలో దర్శకుడు రాఘవేంద్రరావు పంచుకున్నారు.

- Advertisement -

ముద్దు సీన్.. పారిపోయిన మహేష్..

రాఘవేంద్రరావును చిన్నప్పటి నుంచి మహేష్ బాబుకు మామయ్య అని పిలవడం అలవాటు.. సినిమా షూటింగ్లో కూడా అలాగే పిలిచేవారట ఈ చిత్రంలో ప్రీతి జింతా తో ఒక ముద్దు సన్నివేశం లాంటిది ప్లాన్ చేశారు రాఘవేంద్ర రావు . ఒక కూల్డ్రింక్ బాటిల్ తీసుకొచ్చి అందులో ఒక స్ట్రా వేసి ప్రీతి జింతాకు ఇచ్చారు. ఆమె తాగిన తర్వాత అదే స్ట్రా తో మహేష్ తాగాలంటూ సన్నివేశాన్ని వివరించారు.. ఇది వినగానే” నేను చేయను మామయ్య.. కావాలంటే నువ్వే చేసుకో”..అంటూ అక్కడి నుంచి పారిపోయారట మహేష్ బాబు. ఈ విషయాన్ని చెబుతూ తెగ నవ్వే సారు రాఘవేంద్రరావు. ఏదేమైనా. హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై 25 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు మహేష్ బాబు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు