Mr.Bachchan : ఏంటి హరీష్ గారు.. ఇది మీ నుంచి అస్సలు ఎక్స్ఫెక్ట్ చెయ్యలేదు..

Mr.Bachchan : ఆగష్టు 15 విడుదల కాబోతున్న సినిమాల పై జనాల్లో ఆసక్తి రోజు రోజుకు పెరుగుతుంది.. అందులో రవితేజ హీరోగా వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రవితేజకు గత కొంతకాలంలో హిట్ సినిమాలు లేవు. ఈ సినిమాతో హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు.. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయన నుంచి వచ్చే సినిమాలకు జనాల్లో మంచి రెస్పాన్స్ ఉంటుంది.. ఈ సినిమా పై కూడా అంచనాలు ఓ రేంజులో ఉన్నాయి.. అయితే విడుదల డేట్ అనౌన్స్ చేసిన సినిమాలో సాంగ్ షూటింగ్ పూర్తి చెయ్యలేదనే వార్తలు వినిపిస్తున్నాయి..

ఈ సినిమాలోని ఓ పాటను అనపూర్ణ స్టూడియో 7 ఎకరాస్ లోని భారీ సెట్ లో షూటింగ్ చేస్తున్నారట.. ఆ సాంగ్ పూర్తి అయ్యి, దాన్ని ఎడిట్ చేసి మళ్లీ ఫైనల్ గా చెయ్యాలంటే ఎలా లేదనుకున్నా కూడా మినిమమ్ రెండు రోజులు పడుతుంది. అది పూర్తి అయ్యేలోగా ఆగస్టు నెల వచ్చేస్తుంది. ఇది విన్న రవితేజ ఫ్యాన్స్ సినిమా విడుదల పోస్ట్ పోన్ అవుతుందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు.. ఇటీవల ఒక సందర్భంలో మాట్లాడిన హరీశ్ శంకర్ .. మిరపకాయ్ సినిమాకు 100 రెట్లు బాగుంటుందని అన్న హరీష్ బిట్ ను ట్యాగ్ చేస్తూ ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.. ఈ విషయం డైరెక్టర్ స్పందించలేదు. మరి తన పై వస్తున్న వార్తల పై ఎలా స్పందిస్తాడో చూడాలి..

Ravi Teja fans trolling Harish Shankar on Mr. Bachchan song pending
Ravi Teja fans trolling Harish Shankar on Mr. Bachchan song pending

ఇక ఇప్పటికే ఈ సినిమాకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.. ఈ మూవీ నుంచి బయటకు వచ్చిన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. నిన్న రిలీజ్ అయినా రెప్పల్, డప్పుల్ అనే మాస్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.. ఇక సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన కొత్త హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ నటిస్తుంది. అలాగే కీలక పాత్రలో జగపతి బాబు నటిస్తున్నాడు. ఈ మూవీకి మిక్కి జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు