Devara Second Single: లిరికల్ సాంగ్ లీక్ చేసిన లిరిసిస్ట్.. ఫుల్ రొమాంటిక్ గురూ..!

Devara.. ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండవసారి నటిస్తున్న చిత్రం దేవర. ఇదివరకే వీరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరొకసారి వీరిద్దరి కాంబినేషన్లో దేవర సినిమా రాబోతుండడంతో అంచనాలు పీక్స్ కి చేరిపోయాయి. అంతేకాదు ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోందని తెలిసి అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు సెప్టెంబర్ 27వ తేదీన ఫుల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ గా మొదటి భాగం రాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక మాస్ సాంగ్, గ్లింప్స్ రిలీజ్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Devara Second Single: Lyrical Song Leaked Lyricist.. Full Romantic Guru..!
Devara Second Single: Lyrical Song Leaked Lyricist.. Full Romantic Guru..!

థాయిలాండ్ లో రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ..

ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ థాయిలాండ్ వెళ్లి మరీ అక్కడ ఒక రొమాంటిక్ మెలోడీ సాంగ్ చిత్రీకరించిన విషయం తెలిసిందే. అయితే ఆ పాట ఇప్పుడు త్వరలోనే రిలీజ్ కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేవర సినిమా కోసం పాటలు రాసిన రామ జోగయ్య శాస్త్రి తన ట్విట్టర్ ఖాతా లో ఈ రెండవ పాటకు సంబంధించిన లిరిక్స్ ని షేర్ చేశాడు.

రెండవ పాట లిరిక్స్ వైరల్..

తంగం.. అంతరంగం.. హాయిగా.. ఉయ్యాలూగుతున్నట్టుంది.. అంటూ రొమాంటిక్ సాంగ్ కు సంబంధించి లిరిక్స్ షేర్ చేస్తూ.. ఈ లిరిక్స్ ను ఇప్పుడే విన్నాను.. త్వరలోనే వచ్చేస్తుందిలే అంటూ పోస్ట్ చేశారు రామజోగయ్య శాస్త్రి. లిరిక్స్ కాస్త చాలా అద్భుతంగా ఉన్నాయి అని అప్పుడే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రొమాంటిక్ మెలోడీ సాంగ్ అన్నట్టుగా తెలుస్తోంది. జాన్వి – ఎన్టీఆర్ ల పై ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ఎలా చిత్రీకరించారని తెలుసుకోవడానికి అభిమానులు సైతం సంతోషం తో పాటు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

జాన్వీ క్యారెక్టర్ పేరు తంగం..

ఇకపోతే ఈ సినిమాలో జాన్వి కపూర్ క్యారెక్టర్ పేరు తంగం అని, గతంలో జాన్వీ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు చిత్ర బృందం రివీల్ చేసింది. తంగం అంటే బంగారం. అందులో భాగంగానే తంగం అంటూ ఆమె క్యారెక్టర్ పేరు వచ్చేలా సాంగ్ రాసుకున్నారు రామజోగయ్య శాస్త్రి.. ఈ పాట కోసం ఇప్పుడు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి అయితే లిరిక్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇంకొన్ని రోజులు ఎదురు చూడాలా అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ సినిమాలు..

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ఈ సినిమా అయిపోయిన వెంటనే కేజీఎఫ్ సినిమాలతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నారు. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారు ఎన్టీఆర్. ఇక ఈయనతో సినిమా పూర్తయిన తర్వాత మళ్లీ కొరటాల శివ దర్శకత్వంలో దేవర రెండవ భాగం రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు