Harish Shankar : ‘రామయ్య వస్తావయ్యా’ సినిమా ప్లాప్ కి రీసన్ ఇదేనట!

Harish Shankar : టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మాస్ పల్స్ తెలిసిన అతికొద్ది మంది డైరెక్టర్లలో ఈయన ఒకరు. షాక్ అనే సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి ప్లాప్ తో షాకిచ్చిన ఈ డైరెక్టర్ మిరపకాయ్ తో ఊర మాస్ సక్సెస్ కొట్టి స్టార్ హీరోల దృష్టిలో పడ్డాడు. ఇక పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో రికార్డు బ్రేకింగ్ హిట్ కొట్టి సంచలనం సృష్టించాడు. ఆ పై స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తన సత్తా చాటాడు. ఇక లేటెస్ట్ గా రవితేజ తో మిస్టర్ బచ్చన్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆగష్టు 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, హరీష్ శంకర్ సహా చిత్ర యూనిట్ మిస్టర్ బచ్చన్ సినిమా ప్రమోషన్లలో యమ బిజీగా ఉన్నారు. ఇక ఈ క్రమంలో డైరెక్టర్ హరీష్ శంకర్ తన గత చిత్రాల గురించి కూడా చెప్పుకొచ్చాడు.

Harish Shankar about Ramayya Vastavayya Flop

రామయ్య వస్తావయ్యా ప్లాప్ కి కారణం ఇదే – హరీష్ శంకర్

ఇక హరీష్ శంకర్ (Harish Shankar) మిస్టర్ బచ్చన్ సినిమాకి వరుస ఇంటర్వ్యూ లు ఇస్తున్న క్రమంలో తన గత సినిమాల గురించి కూడా ప్రస్తావించాడు. ఇక పదేళ్ల కింద భారీ అంచనాలతో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన రామయ్య వస్తావయ్యా భారీ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, ఫస్ట్ హాఫ్ బాగానే వర్కౌట్ అయినా సెకండ్ హాఫ్ దారుణంగా దెబ్బ కొట్టింది. ఈ విషయమే ప్రస్తావిస్తూ రామయ్యా వస్తావయ్యా’కు సెకండాఫే అసలు సమస్య అని హరీష్ చెప్పుకొచ్చాడు. ఆ సినిమా ఇంటర్వ్యూ లోనే మెయిన్ విలన్ చనిపోతాడని.. అక్కడే సినిమా అయిపోయిందని.. సినిమా సగంలోనే మెయిన్ విలన్ చనిపోవడంతో ఇక చూడ్డానికి ఏముందని ప్రేక్షకులు ఫీలయ్యారని హరీష్ చెప్పుకొచ్చాడు. ఆయా సినిమాకి సెకండాఫ్ స్క్రీన్ ప్లే సరిగా చేసుకోలేదని అందుకే అంత ఘోరంగా ప్లాప్ అయిందని హరీష్ అన్నాడు. పైగా ఐతే తన కెరీర్లో అత్యంత కష్టపడ్డ సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’నే అని హరీష్ చెప్పడం గమనార్హం.

- Advertisement -

ఆ తర్వాతి సినిమా కావడం వల్ల ఓవర్ హైప్…

ఇక తాను తీసిన ‘మిరపకాయ్’ సూపర్ హిట్, అలాగే ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత తన మీద అంచనాలు పెరిగాయని, ఫ్యాన్స్ కూడా ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారని, తాను కూడా హ్యాట్రిక్ కొట్టాలన్న ఉద్దేశంతో ఆ సినిమాకు బాగా కష్టపడి పని చేశానని, ఓవర్ హైప్ వల్ల మరీ అంత ఎక్కువ ప్లాప్ అయిందని హరీష్ చెప్పుకొచ్చాడు. రామయ్య వస్తావయ్యా సినిమా ఫెయిల్యూర్ విషయంలో తాను ఎవ్వరినీ నిందించని, అందుకు పూర్తి బాధ్యత తనదే అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు. ఇక మిస్టర్ బచ్చన్ సినిమా ఆగష్టు 15న రిలీజ్ అవుతుండగా, ఈ సినిమా లో రవితేజ భాగ్య శ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు