Aishwarya Susmita: ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన ప్రముఖ నటి.. మన చేతుల్లోనే ఉందంటూ..?

Aishwarya Susmita.. ఫిలిం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అందులో కొంతమంది క్యాస్టింగ్ కౌచ్ బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటే.. మరికొంతమంది ఇబ్బందులను ఎదుర్కోలేక ఇండస్ట్రీకి దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు. మరికొంతమంది క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొని స్టార్స్ గా మారిన వారు కూడా ఉన్నారు. అయితే మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత ఒక్కొక్కరిగా తమ ఇబ్బందులను మీడియా ముందుకు వచ్చి చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రమ్యకృష్ణ లాంటి సీనియర్ హీరోయిన్లు కూడా అవకాశాలు రావాలంటే పడుకోవాల్సిందే అంటూ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే అయితే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నా అది మన నిర్ణయం పై ఆధారపడి ఉంటుందంటూ చెప్పుకొచ్చింది ఒక నటి..ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ నటి ఐశ్వర్య సుస్మిత కూడా తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి ఆమె మాట్లాడింది.

Aishwarya Susmita: Famous actress who reacted to the casting couch in the industry.. Saying that it is in our hands..?
Aishwarya Susmita: Famous actress who reacted to the casting couch in the industry.. Saying that it is in our hands..?

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్.. నిర్ణయం మనపైనే..

తాజాగా ఈమె బాడ్ కాప్ అనే వెబ్ సిరీస్ లో కనిపించింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగానే క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీ లో ఎక్కువగా ఉందని తెలిపింది.అయితే ఈ విషయాన్ని పెద్దది చేయడం ఒకటే మార్గం కాదని, తాను ఎప్పుడు ఎలాంటి ఆడిషన్స్ ను మిస్ చేసుకోలేదని కూడా తెలిపింది. విలువల విషయంలో రాజీ పడలేదని, కష్టపడి పని చేస్తానని కూడా చెప్పుకొచ్చింది ఐశ్వర్య.. ఐశ్వర్య సుస్మిత మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో నేను ఇలాంటివి ఎన్నో విన్నాను.. చాలా మంది వ్యక్తులు పలు విధాలుగా కథలు చెప్పేవారు. నేను అప్పటికి మోడల్ గానే ఉన్నా.. ఇంకా నటన రంగంలోకి నేను అడుగు పెట్టలేదు.. మీరు ఫలానా వ్యక్తితో పడుకోకపోతే మీకు అవకాశాలు రావు అని నాతో డైరెక్ట్ గా చెప్పేవారు. కానీ సినీ ఇండస్ట్రీలోకి రావడానికి ఇది తప్పుడు మార్గమని.. కానీ ఆ సమయంలో చాలామంది డైరెక్టర్స్ , కాస్టింగ్ డైరెక్టర్లు సైతం చాలామంది తనని పర్సనల్గా కలవాలని నెంబర్లు ఇచ్చే వారిని తెలిపింది.. కానీ ఇక్కడ మనల్ని ఎవరూ బలవంతం చేయడం లేదు.. వెళ్లాలా ? వద్దా? అనేది తమ చేతులలోనే ఉంటుందని కేవలం ఇది ఇండస్ట్రీలలోనే కాదు ప్రముఖ కార్పొరేటర్ రంగాలలో కూడా ఇది చాలా ఎక్కువగా ఉందంటూ తనకు జరిగిన కొన్ని అనుభవాలను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఏదేమైనా ఇండస్ట్రీలో జరుగుతున్న ఇలాంటి విషయాలపై షాకింగ్ కామెంట్స్ చేసింది ఐశ్వర్య సుస్మిత.

ఐశ్వర్య సుస్మిత కెరియర్..

ఐశ్వర్య సుస్మిత విషయానికి వస్తే.. మోడల్గా కెరియర్ ఆరంభించిన ఈమె 2016లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్ గా తొలిసారి అవకాశం అందుకుంది. మోడలింగ్ నుంచి ఆ తర్వాత నటన వైపు అడుగులు వేసింది. ప్రస్తుతానికి ఓటీటీ లో అరంగేట్రం చేసిన ఐశ్వర్య సెట్స్ మీద త్వరలోనే సినిమాలలో నటించడానికి సిద్ధమవుతోంది. మరి ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి అయితే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కావచ్చు ఉందని కానీ అది మన నిర్ణయం పైన ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చింది ఐశ్వర్యం సుస్మిత.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు