RaghuThatha : అక్కడ మహానటి మళ్లీ బిజీ అవుతుందా?

RaghuThatha : టాలీవుడ్ లో మహానటిగా పాపులర్ అయిన భామ కీర్తి సురేష్ మొన్నటివరకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఆ సినిమా వచ్చినప్పుడు ఇండస్ట్రీ లో ఇక నెంబర్ వన్ హీరోయిన్ కీర్తియే అవుతుందని అనుకున్నారు అందరూ. అప్పటికి వరుస సినిమాలతో దూసుకుపోయింది. కానీ ఆ తర్వాత వరుస పరాజయాలు కూడా రావడంతో మెల్లిగా డౌన్ అయింది. ఈ మధ్య అసలు స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు రాకపోగా, అడపాదడపా మీడియం రేంజ్ హీరోల సినిమాల్లోనే నటిస్తుంది. ఇక సౌత్ లో అంతగా పనవ్వడం లేదని బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ చాలా రోజుల తర్వాత ఓ తమిళ్ సినిమాలో నటించింది.

Keerthy Suresh starrer RaghuThatha movie got clean U certificate

సెన్సార్ పూర్తి చేసుకున్న కీర్తి కొత్త సినిమా!

ఇక కీర్తి సురేష్ (RaghuThatha) రీసెంట్ గా తమిళ్ లో రఘు తాత అనే సినిమాలో నటించింది. ప్రముఖ అగ్ర నిర్మాత సంస్థ హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కగా, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ లోనే పూర్తయింది. కానీ పలు ఫైనాన్షియల్ ఇష్యూస్ తో, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ లో జాప్యం వల్ల వాయిదా పడింది. ఇక లేటెస్ట్ గా అన్ని పనులు పూర్తి చేసుకుని తాజాగా సెన్సార్ కి వెళ్ళింది ఈ సినిమా. ఇక రఘు తాత సినిమాకు సెన్సార్ నుండి క్లీన్ యూ సర్టిఫికెట్ రావడం విశేషం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

- Advertisement -

ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లో ఎక్కుతుందా?

ఇక రీసెంట్ గా వరుస ప్లాప్ లు అందుకున్న కీర్తి సురేష్ రఘు తాత సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాలని చూస్తుంది. ఇంట్లో ఉన్న సమస్యలతో పోరాడి, తరువాత సమాజంలో ఉన్న ఛాలెంజెస్ ని ఎదుర్కునే అమ్మాయి పాత్రలో కీర్తి కనిపించబోతుందని సమాచారం. ఇక ఈ సినిమా ఆగష్టు 15న తమిళ్ లో రిలీజ్ అవుతుందనగా, తెలుగులో పోటీ వల్ల వాయిదా వేయగా, సోలో రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు