Niharika: అల్లు అర్జున్ తో మెగా ఫ్యామిలీ గొడవలపై ఓపెన్ అయిన నిహారిక..!

Niharika.. గత కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ అల్లు కుటుంబానికి మధ్య ఒక వార్ నడుస్తూనే ఉంది.. ఈ విషయం పైన ఇప్పటికే చాలామంది అల్లు అర్జున్ ని దారుణంగా ట్రోల్ చేశారు మెగా అభిమానులు.. అందుకు కారణం 2024 ఎన్నికలలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజవర్గంలో పోటీ చేస్తున్నప్పుడు మెగా ఫ్యామిలీ తో బుల్లితెర వెండితెర సెలబ్రిటీలు అందరూ కూడా నేరుగా పిఠాపురం పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేసి ఈయనకు సపోర్టుగా నిలిచారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తన భార్య స్నేహితురాలి భర్త అయిన వైసిపి నేత శిల్ప రవిచంద్రారెడ్డికు మద్దతుగా ప్రచారం చేశారు.

Niharika: Niharika opened up on mega family quarrels with Allu Arjun..!
Niharika: Niharika opened up on mega family quarrels with Allu Arjun..!

అల్లు vs మెగా..

ఇక అప్పటి నుంచి అటు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మధ్య ఒక వార్ అనేది నడుస్తూనే ఉన్నది. అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూడా ట్విట్టర్ లో ఒక కౌంటర్ కూడా వేయడం జరిగింది. పరాయి వాళ్ళు మావాళ్లు.. ఆడవాళ్లు పరాయి వాళ్ళు అంటూ కౌంటర్ వేశాడు. ఇది అల్లు అర్జున్ అభిమానులను చాలా హర్ట్ అయ్యేలా చేసింది. ఆ వెంటనే అభిమానులు చేసిన రచ్చకి నాగబాబు వెంటనే డిలీట్ చేశారు. ఇక మరొక హీరో సాయి ధరంతేజ్ కూడా సోషల్ మీడియా అకౌంట్లో అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేయడం జరిగింది. ఇలాంటి పరిణామాలని చూస్తే మెగా హీరోలు అల్లు అర్జున్ మీద కోపంగానే ఉన్నారనిపిస్తుంది.

గొడవలపై క్లారిటీ ఇచ్చిన నిహారిక..

అయితే ఈ విషయం పై ఇప్పటి వరకు అటు మెగా హీరోలు కానీ.. ఇటు అల్లు హీరోలు కానీ ఎవరు స్పందించలేదు. కానీ తాజాగా మెగా డాటర్ నిహారిక ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు..ఈ ప్రశ్న ఎదురవగా, అందుకు సమాధానంగా ఇలా తెలియజేసింది. నిహారికకు అల్లు అర్జున్ విషయంలో మెగా హీరోల ఆలోచన ఏంటి అని ప్రశ్నించగా..? వీటి పైన నిహారిక మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వారికి కచ్చితంగా ఉంటాయి. అల్లు అర్జున్ విషయంలో కూడా అదే జరిగింది. ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తారు అన్నది పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయము. అల్లు అర్జున్ పైన మెగా ఫ్యామిలీలో ఎలాంటి వ్యతిరేకత లేదంటూ పరోక్షంగానే నిహారిక క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

- Advertisement -

అల్లు అర్జున్ సినిమాలు..

అంతేకాకుండా అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించారు. పుష్ప-2 సినిమా ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అల్లు అర్జున్. మరి ఈ సినిమా పైన మెగా అభిమానుల ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా లేదా అనే విషయం చూడాలి మరి. ఏది ఏమైనా నిహారిక చేసిన కామెంట్లు అటు అభిమానులలో కాస్త ఆనందాన్ని కలిగిస్తున్నాయి. మరి ఇప్పటికైనా అల్లు – మెగా అభిమానుల మధ్య గొడవలు తగ్గుతాయా ప్రశ్నార్థకంగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు