HBD KiaraAdvani : జాబిలమ్మకు ‘గేమ్ ఛేంజర్’ టీం స్పెషల్ విషెస్..

HBD KiaraAdvani : టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లలో కియారా అద్వానీ క్రేజే వేరు. చేసినవి రెండు సినిమాలే అయినా టాలీవుడ్ మూవీ లవర్స్ కి పేవరేట్ క్రష్ లిస్ట్ లో చేరిపోయింది. బాలీవుడ్ లో ఓ చిన్న సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కియారా, ఎమ్మెస్ ధోని బయోపిక్ లో బాగా పాపులర్ అయింది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ లో భరత్ అనే నేను సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది కియారా. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ కావడంతో కియారా కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే వెంటనే ఒకే చేయకుండా ఆచితూచి ఆఫర్లు అందుకుంటుంది. ఆ తర్వాత తెలుగులో వినయ విధేయ రామ సినిమా చేసింది. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా అందులో గ్లామర్ షో తో అట్రాక్ట్ చేసింది.

Game Changer Team Special Birthday Wishes to Kiara Advani

బాలీవుడ్ క్రష్ గా కియారా..

ఇక కియారా బాలీవుడ్ లో కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ తో బాలీవుడ్ లో చాలా మందికి క్రష్ అయింది. ఆ తర్వాత షేర్షా, భూల్ భూలియా2, సత్యప్రేమ్ కి కథా వంటి సినిమాలతో సక్సెస్ ని అందుకుని స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అయితే కియారా అద్వానీ చేసింది తక్కువ సినిమాలే అయినా, ప్రతి సినిమాలో తన మార్క్ చూపించింది. తన గ్లామర్ షో తోనే కాకుండా మంచి రోల్ దొరికితే డీసెంట్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టింది కూడా. ఇక ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్” లో హీరోయిన్ గా నటిస్తుంది కియారా. కాగా లేటెస్ట్ గా కియారా బర్త్ డే (HBD KiaraAdvani) సందర్బంగా చిత్ర యూనిట్ కియరాకు స్పెషల్ బర్త్ డే విషెస్ ని అందచేశారు.

- Advertisement -

కియారా కి స్పెషల్ బర్త్ డే విషెస్..

కియారా అద్వానీ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ లో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ తో వినయ విధేయ రామ తర్వాత రెండో సారి నటిస్తుండగా, శంకర్ వంటి సేన్సేషనల్ డైరెక్టర్ తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమాపై కియారా చాలా ఆశలు పెట్టుకుంది. ఇక తాజాగా కియారా అద్వానీ బర్త్ డే (జులై 31) సందర్బంగా, గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్ స్పెషల్ బర్త్ డే విషెస్ ని అందచేసింది. ఈ జాబిలమ్మకు బర్త్ డే విషెస్ అంటూ గేమ్ ఛేంజర్ లో పాట లో ఉన్న లుక్ ని రిలీజ్ చేస్తూ, కియారా బర్త్ డే పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఆ పోస్టర్ లో కియారా చాలా అందంగా ఉంది. ఇక కియారా ఈ సినిమాలో దీపికా ఐఏఎస్ ఆఫీసర్ గా నటిస్తుందని సమాచారం. క్రిస్మస్ స్పెషల్ గా ఈ సినిమా రానుందని నిర్మాత దిల్ రాజు అనౌన్స్ చేసాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు