Kollywood : ఇండస్ట్రీలో ఎవరికి వారే.. హీరో కార్తీ సీరియస్..!

Kollywood.. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నవంబర్ ఒకటవ తేదీ తర్వాత షూటింగ్లకు అనుమతి లేదని తమిళ సినీ నిర్మాతల మండలి తీర్మానించిన విషయం తెలిసిందే. అయితే ఈ వైఖరిని నడిగర్ సంఘం కోశాధికారి కార్తీ ఖండిస్తూ సీరియస్ కామెంట్స్ చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన కార్తీ.. ఇలాంటి విషయాలను ప్రకటించే ముందు ఇండస్ట్రీలో ఉండే అందరితో కూడా చర్చించాల్సి ఉంటుంది. అందరి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇది వేలాదిమంది కార్మికుల జీవితాలకు సంబంధించిన విషయం. ధనుష్ పై చర్యలు తీసుకోబోతున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు ఆయన పై ఎలాంటి ఫిర్యాదు నడిగర్ సంఘానికి రాలేదు.. ముఖ్యంగా నటుల వృత్తిని పూర్తిగా నిషేధిస్తున్నట్టు ప్రకటించడాన్ని ఆమోదించలేము.. ఇండస్ట్రీలో ఎవరికి వారు పెద్ద అయిపోయారు అంటూ తెలిపారు కార్తీ.

Kollywood : Who's who in the industry.. Hero Karthi is serious..!
Kollywood : Who’s who in the industry.. Hero Karthi is serious..!

నిర్మాతల మండలిపై కార్తీ సీరియస్..

అంతేకాదు ఈ విషయంపై సంఘం తరఫున పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపిన కార్తీ , నిర్మాతల సంఘం లేవనెత్తిన ప్రశ్నలకు తగిన సమాధానాలతో కూడా ఒక నివేదిక సిద్ధం చేస్తామని, దానిని కూడా త్వరలోనే విడుదల చేస్తామని కూడా తెలిపారు కార్తీ. మొత్తానికైతే తమిళ సినీ ఇండస్ట్రీలో తీసుకునే నిర్ణయాలపై నడిగర్ సంఘం కోశాధికారి హీరో కార్తీ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

నవంబర్ 1 నుండి షూటింగ్ లన్నీ బంద్..

అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే, అడ్వాన్సులు తీసుకొని సినిమా షూటింగ్ మొదలు పెట్టకుండా హీరోలు ఎగ్గొడుతున్నారనే విషయంపై నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఎవరెవరు నిర్మాతల దగ్గర సినిమాలు చేస్తామని అడ్వాన్స్ తీసుకున్నారో వారంతా కూడా కచ్చితంగా సినిమాలు చేయాలని , ఆ సినిమాలు చేసే వరకు కొత్త ప్రాజెక్టులు చేయకూడదని స్పష్టం చేసింది. అంతేకాదు ఈ విషయం ఇండస్ట్రీలో ఉండే హీరోలందరికీ కూడా వర్తిస్తుందని నిర్మాతల మండలి తెలిపింది. ఈ మేరకు నవంబర్ ఒకటవ తేదీ నుంచి సినిమా షూటింగ్లన్నీ ఆపి వేస్తున్నామని స్పష్టం చేయడంతో ఈ విధంగా హీరోలు ఒక్కొక్కరిగా స్పందించడం గమనార్హం.

- Advertisement -

కార్తీ కెరియర్..

హీరో కార్తీ విషయానికి వస్తే.. ఈయన అసలు పేరు కార్తీక్ శివకుమార్. తమిళ సినిమాలలో నటించిన ఈయన తెలుగులో కూడా భారీ క్రేజ్ దక్కించుకున్నారు. ముఖ్యంగా తమిళంలో నటించిన చాలా సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేయడం వల్ల తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం అయ్యారని చెప్పవచ్చు. అంతేకాదు స్వయంగా తన పాత్రకి తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం వల్ల ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. మొదట మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన కార్తి 2007లో వచ్చిన పరుత్తివీరన్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఇక తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈయన 2010లో వచ్చిన యుగానికి ఒక్కడు చిత్రంతో భారీ క్రేజ్ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆవారా, ఖాకీ , ఖైదీ, సుల్తాన్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించారని చెప్పవచ్చు. ఇక తమిళంలో నటించిన చాలా సినిమాలను తెలుగులో రీమేక్ చేసి భారీ విషయాన్నీ సొంతం చేసుకున్నారు. అలా తెలుగు , తమిళ్ ప్రేక్షకులను అలరిస్తున్నారు కార్తీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు