Bollywood Heroine: పెళ్ళై 6 నెలలు కూడా కాలేదు.. అప్పుడే విడాకులా.?

Bollywood Heroine.. ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు ఎక్కువ మంది విడాకులు తీసుకొని విడిపోతున్నారు. చిన్నచిన్న కారణాలకే విడాకులు తీసుకోవడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలలో కూడా ఇదే తంతు కొనసాగుతోంది. ముఖ్యంగా చాలామంది హీరో హీరోయిన్ల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే చాలు విడాకుల బాట పడుతున్నారు. చివరికి వారు విడిపోయి ఎవరి జీవితంలో వారు ఒంటరిగా బ్రతుకుతున్నారు. మరికొంతమంది ఇంకొక తోడు వెతుక్కుంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఒక బాలీవుడ్ హీరోయిన్ పెళ్లి జరిగి ఆరు నెలలు కూడా కాలేదు. అప్పుడే విడాకులు బాట పట్టబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరి ఆ హీరోయిన్ ఎవరు? అసలు ఏం జరిగింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

Bollywood Heroine: Married not even 6 months.. Divorce now?
Bollywood Heroine: Married not even 6 months.. Divorce now?

విడాకుల దిశగా పరిణీతి చోప్రా..

బాలీవుడ్, హాలీవుడ్ లో సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. సోదరి పరిణీతి చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో కూడా పరిణీతి చోప్రా అక్కలాగే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రియాంక సోదరిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనదైన స్టైల్ లో సినిమాలు చేసి సొంత ఇమేజ్ దక్కించుకుంది. అలా కెరియర్ పీక్స్ లో ఉండగానే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో ప్రేమలో పడిన ఈమె ఇటీవలే వివాహం చేసుకుంది. ఇకపోతే వీరి వివాహం జరిగే సంవత్సరం కూడా కాలేదు. ఇంతలోనే అతనితో విడాకులు తీసుకోబోతోంది అంటూ ఒక వార్త హల్చల్ చేస్తోంది. అయితే దీనికి కారణం పరిణీతి ఈ మధ్య చేసిన ఒక పోస్ట్ అని చెప్పవచ్చు..

పోస్ట్ కి అర్థం అదేనా..?

ఇంతకు పరిణీతి చోప్రా చేసిన పోస్ట్ ఏంటి..? అందులో ఏముంది..? అనే విషయానికొస్తే నా జీవితాన్ని ప్రతిబింబించడానికి కొంత టైం తీసుకున్నాను. ఇది నా నమ్మకాన్ని పునరుద్ఘాటించింది. మైండ్ సెట్ అనేది అన్నిటికీ ప్రధానం.. అలాంటి మైండ్ సెట్ ను అన్ని విషయాలలో ప్రాముఖ్యత ఇచ్చేలా చేయకండి. ఒక్క సెకండ్ కూడా వృధా చేయకండి. నీ లైఫ్ ఒక గడియారం లాంటిది. ప్రతిక్షణం మీకు ఇష్టం వచ్చినట్టు గడపాలి తప్ప. ఇతరులను ఆకట్టుకోవడానికి జీవించడం మానేయండి. ఇతరుల అభిప్రాయాలకు తగ్గట్టుగా మీరు జీవిస్తే, మీ జీవితంలో మీకంటూ ఒక ప్రత్యేకత ఏమీ ఉండదు. మీరు లైఫ్ లో ఉన్నటువంటి విషపూరితమైన వ్యక్తులను విసిరి పాడేయడానికి మీరు భయపడకండి. పక్క వారు ఏమనుకుంటారు అని భయపడితే, మీరు మీ జీవితంలో మీరు కోరుకున్న సంతోషాన్ని పొందలేరు. ఇది చిన్న జీవితం ఎలా జీవించాలి అనుకుంటున్నారో అలా జీవించండి అంటూ పోస్ట్ షేర్ చేసింది. పరిణీతి చోప్రా ఇది చూసిన వారందరూ నిజంగానే విడాకులు తీసుకోబోతుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పరిణితి చోప్రా చేసిన పోస్ట్ కి అర్థం ఏమిటో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఈ విషయం ఆమె విడాకులు దిశగా వెళుతూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by @parineetichopra

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు