Indian 2 OTT Release : ఇండియన్ 2కి ట్రబుల్స్… డిజిటల్ స్ట్రీమింగ్ పై ఓటిటి సంస్థ బేరాలు

Indian 2 OTT Release : లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు 2 మూవీ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు తీవ్ర నిరాశ కలిగించింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. అంతేకాకుండా ఈ ఏడాది కోలీవుడ్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిపోయింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇండియన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కు సమస్యలు ఎదురైనట్టు సమాచారం.

ఇండియన్ 2పై ఓటీటీ స్ట్రీమింగ్ పై బేరాలు

ఇండియన్ 2 మూవీ పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కానీ నెట్ ఫ్లిక్స్ ఇటీవల కాలంలో కొత్త రూల్ ను పెట్టుకుంది. ఒకవేళ సినిమాలు థియేటర్లలో మంచి వసూళ్లు రాబట్టడంలో విఫలమైనా లేదా ప్రజల రెస్పాన్స్ నెగెటివ్ గా ఉన్నా కూడా డీల్ కుదుర్చుకున్న మొత్తం కంటే తక్కువ ధరలతో ఓటీటీ స్ట్రీమింగ్ పై నిర్మాతలతో బేరసారాలు కొనసాగిస్తోంది. ఇండియన్ 2 విషయానికొస్తే బాక్సాఫీస్ పనితీరు, మౌత్ టాక్ రెండూ పేలవంగా ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇండియన్ 2 మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో ఓటీటీ ఒప్పందాన్ని తిరిగి చర్చించడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇండియన్ 2 ఓటీటీ విడుదల ఇప్పుడు సమస్యల్లో పడిననట్టైంది.

Indian 2 OTT release date | When and where to watch Kamal Haasan's film online? | Ott News - News9live

- Advertisement -

నెట్‌ఫ్లిక్స్ మొదట్లో ఇండియన్ 2 కోసం భారీ డీల్ తో ముందుకొచ్చింది. కానీ ప్రజల నుండి ఈ సినిమాకు వచ్చిన పేలవమైన స్పందనను చూసిన తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు ముందు డీల్ చేసుకున్న మొత్తంలో సగం మాత్రమే చెల్లించడానికి సిద్ధంగా ఉంది. ఇక ఇండియన్ 3 వచ్చే ఏడాది పెద్ద స్క్రీన్‌లలోకి రానుంది. ఈ చర్చల కారణంగా మూడవ పార్ట్ కూడా ప్రమాదంలో పడినట్టే అని చెప్పవచ్చు. ఇండియన్ 2 ఈ చర్చలు ముగిసేదాకా ఓటీటీలోకి వచ్చే ప్రసక్తే లేదని తెలుస్తోంది.

సగం కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది

250 కోట్ల బిజినెస్ టార్గెట్ తో జూలై 12న భారీ ఎత్తున రిలీజైన ఇండియన్ 2 మూవీ ఇప్పటివరకు కేవలం 146.58 కోట్ల కలెక్షన్స్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. అయితే ఇప్పడు ఓటీటీలకు ఆదరణ విపరీతంగా పెరగడంతో మేకర్స్ సైతం తమ సినిమాల ఓటీటీ డీల్స్ ను ముందుగా క్లోజ్ చేస్తున్నారు. అలాగే కొత్త సినిమాలను థియేటర్ లలోకి రాకముందే ఓటీటీ సంస్థలు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను పోటీ పడి మరీ భారీ బడ్జెట్ పెట్టి కొనుక్కుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండియన్ 2 మూవీకి రిలీజ్ కు ముందు భారీ హైప్ ఉండడంతో నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ రైట్స్ ను 120 కోట్లకు కొనుక్కుంది. థియేటర్ లో ఈ మూవీ దారుణంగా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ పై కూడా దెబ్బ పడింది. థియేటర్లలో ఇండియన్ 2 మూవీని చూసిన వారు పెదవి విరిచినా, ఇంకా సినిమాను చూడని వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఈ మూవీ స్ట్రీమింగ్ ఇప్పట్లో అయ్యేలా లేదు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు