Devara: దేవర అప్డేట్ ఇచ్చిన నాగవంశీ, విజయ్ దేవరకొండ సినిమా పరిస్థితి ఏంటి.?

Devara: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో నాగ వంశీ ఒకరు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ సినిమాలను నిర్మిస్తూ ఉంటారు. ఇంకా ఈ నిర్మాణ సంస్థకి విషయానికి వస్తే హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ కి అనుసంధానంగా ఈ బ్యానర్ను స్థాపించారు. మామూలుగా హారిక హాసిని బ్యానర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు తీస్తూ ఉంటారు. కేవలం త్రివిక్రమ్ మాత్రమే ఆ బ్యానర్ లో సినిమాలు చేస్తుంటాడు. మిగతా దర్శకులతో సినిమాలు చేయాలి అనుకున్నప్పుడు సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ముందుకు వస్తుంది.
నాగ వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే సోషల్ మీడియాలో నాగ వంశీ ఎంత యాక్టివ్ గా ఉంటారు చాలామందికి తెలుసు.

సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఒక సినిమా నిర్మితమవుతుంది అన్నప్పుడు నుంచే ఆ సినిమాకి ప్రమోషన్ మొదలైపోయినట్లే, ఎందుకంటే నాగ వంశీ ఆ సినిమా గురించి అంతగా లేపుతూ వస్తారు. ఆ ప్రొడక్షన్ హౌస్ లో లేని సినిమా గురించి కూడా కొన్నిసార్లు ఎలివేషన్ ఇస్తూ ఉంటారు. ఇక రీసెంట్ గా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమాలోని ఫస్ట్ సింగిల్ గురించి మాట్లాడుతూ ఈ ఫస్ట్ సింగిల్ ను నేను ఇదివరకే విన్నాను హూకుం సాంగ్ ని మర్చిపోతారు అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత చాలామందికి ఆ స్థాయిలో అనిపించకపోవడం వలన నాగ వంశీ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

Nagavamsi About Devara

- Advertisement -

ఇక రీసెంట్గా మరోసారి దేవర సినిమా అప్డేట్ ఇచ్చాడు నాగ వంశీ. అరవింద సమేత వీర రాఘవ సినిమాలోని రెండు పిక్స్ ను షేర్ చేసి. తారక్ అన్న ను మళ్లీ మనం ఎంత క్యూట్ గా చూడబోతున్నాం మనకు కావలసింది కూడా ఇంకేముంది అంటూ సినిమా గురించి అప్డేట్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం నాగ వంశీ గౌతమ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరియర్ లో 12వ సినిమాగా ఈ సినిమా వస్తుంది. అయితే ఈ సినిమా అప్డేట్ ఇంకా నాగ వంశీ ఇవ్వలేదని కొందరు కామెంట్స్ లో వంశీని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు