Rashmika: పుష్ప 2 సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన రష్మిక

Rashmika: కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన చలో సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీతగోవిందం అనే సినిమాలో నటించింది. పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించి దాదాపు 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఇక్కడితో వీరిద్దరి మధ్య స్నేహం బలపడింది.

ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు రష్మికకు వచ్చాయి. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేసింది రష్మిక. ఈ సినిమాతోనే పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు సాధించుకుంది. ప్రస్తుతం రష్మిక కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా కూడా సినిమా రానుంది. ఈ సినిమాలో కూడా రష్మిక నటిస్తోంది. అలానే ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ కి కూడా రష్మిక సైన్ చేసింది. ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అనిమల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ సినిమాలో రష్మిక తన కెరియర్ బెస్ట్ పర్ఫామెన్స్ ను ఇచ్చింది.

Rashmika Mandanna

- Advertisement -

ఇక రీసెంట్ గా ఆహాలో ప్రసారమయ్యే ఇండియన్ ఐడియల్ తెలుగు సింగింగ్ షో కి గెస్ట్ గా హాజరైంది రష్మిక. ఈ ఎపిసోడ్ త్వరలో స్ట్రీమింగ్ కి రానుంది. ఆ ఎపిసోడ్ సంబంధించిన ప్రోమో ని రీసెంట్గా రిలీజ్ చేసింది ఆహా వీడియో సంస్థ. దీనిలో రష్మికను పుష్ప 2 సినిమా గురించి ఎవరికీ తెలియని అప్డేట్ చెప్పండి అని అడిగినప్పుడు. పుష్ప 2 సినిమా గురించి మాట్లాడుతూ మచ్ మచ్ బిగ్గర్ దెన్ పుష్ప అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు