Mr Bacchan : అన్ని చోట్లా బచ్చన్ బ్యూటీ హవానే? బుల్లితెరపై కూడా..

Mr Bacchan : టాలీవుడ్ లో మరో వారాల తర్వాత సినిమాల జాతర రంజుగా ఉండబోతుంది. చిన్నా పెద్దా కలిపి పంద్రాగస్టుకి అరడజను సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయన్న సంగతి తెలిసిందే. అయితే అందులో తెలుగు మూవీ లవర్స్ ఫోకస్ ఎక్కువగా డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాలపైనే ఉంది. అయితే ప్రస్తుతానికి టాలీవుడ్ లో అందరి ఫోకస్ మిస్టర్ బచ్చన్ సినిమాపైనే ఉండేలా చేస్తున్నారు ఆ చిత్ర యూనిట్. ముఖ్యంగా డైరెక్టర్ హరీష్ శంకర్ వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై మీడియా కూఫా ఫోకస్ చేసేలా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించగా, హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ కి పరిచయమవుతుందని తెలిసిందే.

 Mr Bacchan actress Bhagyashree Borse at Zee Telugu program

బచ్చన్ బ్యూటీ హవా..

అయితే తెలుగులో భాగ్యశ్రీ కి ఇదే మొదటి సినిమా. ఇతర భాషల్లో కూడా ఏ సినిమా చేసినట్టు లేదు. అయినా వరుస ప్రమోషన్లతో మూవీ లవర్స్ ని తనవైపునకు తిప్పుకుంటుంది. చాలా మంది నెటిజన్లు ఈ హీరోయిన్ కి టాలీవుడ్ లో మంచి ఫ్యూచర్ ఉందని లెక్కేలేసి చెప్తున్నారు. పైగా ఆల్రెడీ మిస్టర్ బచ్చన్ లో నటిస్తూనే మరో రెండు తెలుగు సినిమాలకు కూడా సైన్ చేసింది భాగ్యశ్రీ. ఇక రీసెంట్ గా ఈ సినిమా టీజర్ లాంచ్ లో భాగ్యశ్రీ ఏకంగా డాన్స్ కూడా వేసిన సంగతి తెలిసిందే. మిస్టర్ బచ్చన్ హిట్ అయితే భాగ్యశ్రీకి టాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఆఫర్లు వస్తాయని నెటిజన్లు అంటున్నారు.

- Advertisement -

బుల్లితెరపై కూడా…

ఇక మిస్టర్ బచ్చన్ (Mr Bacchan) బ్యూటీ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాపై బజ్ పెంచేందుకు ట్రై చేస్తుంది. పైగా సాంగ్స్ లో కూడా తన లుక్స్ తో రవితేజని డామినేట్ చేసిందని టాక్. ఇక లేటెస్ట్ గా బుల్లితెరని కూడా వదల్లేదు ఈ బ్యూటీ. తాజాగా జీ తెలుగు ఛానల్ లో బోనాలు జాతర ప్రోగ్రాం కి వెళ్లి సందడి చేసింది. అంతే కాదు పంద్రాగస్టుకి సంబంధించిన ఇంటర్వ్యూలు కూడా ఇప్పుడే ఇవ్వబోతుందట. ఫస్ట్ సినిమాకే అంత డిడికేషన్ చూపిస్తుడడంతో భాగ్యశ్రీ పేరు ఇండస్ట్రీ లో బాగా వినబడే పేరు అవుతుందని అంటున్నారు నెటిజన్లు. ఇక మిస్టర్ బచ్చన్ ను వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మసిస్తుండగా, మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఆగష్టు 15న మిస్టర్ బచ్చన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు