Keerthy Suresh: కీర్తి సురేష్ కి ఆ హీరో తో కలిసి పని చేయాలనీ ఉందట

Keerthy Suresh: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో కీర్తి సురేష్ ఒకరు. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన నేను శైలజ అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి అనే సినిమాలో కూడా నటించింది. అయితే ఈ సినిమా ఊహించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. కానీ కీర్తికి మాత్రం అవకాశాలు బాగానే వచ్చాయి.

మహానటి సినిమాతో బ్రేక్

తెలుగు సినిమాలో బయోపిక్ సినిమాల గురించి ప్రస్తావన వస్తే మొదట మాట్లాడవలసిన సినిమా మహానటి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. బయోపిక్ ను అందరినీ ఆకట్టుకునేలా తీసి ప్రేక్షకుల హృదయాల్లో ఒక స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో మొదట కీర్తి సురేష్ నటిస్తుంది అని అనౌన్స్మెంట్ చేసినప్పుడు చాలామంది విమర్శలు చేశారు. వీటన్నిటికీ సమాధానంగా కీర్తి తన పర్ఫామెన్స్ తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికీ కీర్తి కెరియర్లో బెస్ట్ ఫిలిం అంటే మహానటి అని చెప్పొచ్చు.

దసరా సినిమాతో మరికొంత గుర్తింపు

శ్రీకాంత్ ఓదెల దర్శకుడుగా పరిచయమైన సినిమా దసరా. నాని హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో వెన్నెల అనే పాత్రలో నటించింది కీర్తి. అయితే ఈ పాత్ర కోసం ముందు చాలామందిని అనుకున్నాడు దర్శకుడు శ్రీకాంత్. అయితే కీర్తి బాగుంటుందని నాని చెప్పినప్పుడు కీర్తి కి కథ చెప్పడం మొదలుపెట్టాడు. కీర్తి కి మొదట అర్థం కాక తనకి నచ్చలేదు అని చెప్పింది. అలా చెప్పడంతో దర్శకుడు కూడా కొంచెం హ్యాపీ అయ్యాడు. మళ్లీ నాని ఒకసారి వినమని రిక్వెస్ట్ చేయడంతో ట్రాన్స్లేటర్ సహాయం తో కథను విన్నారు కీర్తి. ఆ తర్వాత శ్రీకాంత్ కూడా కీర్తితో పనిచేయటం మొదలుపెట్టాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది.

- Advertisement -

 Simbu

ప్రతి హీరోకి హీరోయిన్ కి తమకిష్టమైన హీరోతో హీరోయిన్ తో పని చేయాలని కోరిక ఉండడం సహజం. ఇకపోతే కీర్తి సురేష్ ను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మీకు ఎవరితో పని చేయాలని ఉంది అని అడిగినప్పుడు, నాకు శింబు తో వర్క్ చేయాలని ఉంది. ఆయనతో ఒక రెండు సార్లు నేను ఫోన్ కాల్ లో మాట్లాడాను. ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పకొచ్చారు కీర్తి సురేష్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు