Kanguva: సినిమా మీద ఎంత నమ్మకం అంటే, ప్రపంచ వ్యాప్తంగా ఓన్ రిలీజ్

Kanguva: 2001లో ఒక మలయాళం సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా తన జర్నీ స్టార్ట్ చేశాడు శివ. ఆ తర్వాత తెలుగు, తమిళ్ లో చాలా చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశాడు. అయితే గోపీచంద్ హీరోగా చేసిన శౌర్యం సినిమాతో దర్శకుడుగా మారాడు శివ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ దర్శకుడుగా మంచి పేరు శివకి దక్కింది.

సౌర్యం సినిమా తర్వాత మళ్లీ గోపీచంద్ హీరోగా శంఖం అనే సినిమాను తెరకెక్కించాడు శివ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించింది. ఇకపోతే ఈ సినిమా స్టోరీ చాలామందికి బాగా కనెక్ట్ అయిందని చెప్పొచ్చు. కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన మిర్చి స్టోరీ దాదాపుగా ఇదే కథను పోలి ఉంటుందని కూడా చెప్పొచ్చు. అప్పట్లో శంఖం సినిమాని శివ కాపీ కొట్టాడని కొన్ని వార్తలు కూడా వినిపించాయి.

అయితే శంఖం సినిమా తర్వాత తెలుగులో సినిమాలు తీయటం మానేశాడు శివ. తమిళ్లో సినిమాలు తీయటం మొదలుపెట్టాడు.
తమిళ్లో స్టార్ హీరోల్లో ఒకరైన అజిత్ తో వరుసగా సినిమాలు చేశాడు శివ. అయితే ఈ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాయి. శివ దర్శకత్వం వహించిన సినిమాల్లో ఒక సినిమా తెలుగులో కూడా రీమేక్ అయింది.

- Advertisement -

డాలి దర్శకత్వంలో వచ్చిన కాటంరాయుడు అనే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు అలీ, శివ బాలాజీ, చైతన్యకృష్ణ వీరంతా కలిసి నటించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతిహాసన్ నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది.

Kanguva

అయితే అజిత్ తో చేసిన మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. అయితే లాస్ట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ తో అన్నతే అనే సినిమాను తెరకెక్కించాడు శివ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని అందివ్వలేదు. ఇకపోతే ఇదివరకే శివ చేసిన సినిమాలను పవన్ కళ్యాణ్ మాత్రమే రీమిక్ చేయడం కాకుండా, మెగాస్టార్ చిరంజీవి కూడా వేదాళం అనే సినిమాను భోళా శంకర్ గా తెలుగులో తెరకెక్కించారు. అయితే తెలుగులో ఈ సినిమా ఊహించిన విజయాన్ని సాధించలేదు.

ఓన్ రిలీజ్

ఇకపోతే ప్రస్తుతం శివ సూర్య హీరోగా కంగువ అనే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఒక వీడియో కూడా అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఒక పాటలో కంప్లీట్ గా గూస్బూమ్స్ వస్తాయని తెలుస్తుంది. అయితే ఈ సినిమా మొదటి తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ నుంచి వచ్చే అసలైన పాన్ ఇండియా సినిమా అంటూ తమిళ్ అభిమానులు చెబుతున్నారు. అలానే ఈ సినిమాని నిర్మాత జ్ఞానవేల్ రాజా ఎవరికీ అమ్మకుండా తనే ఓన్ రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు