Sekhar Master: మళ్లీ శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం.. ఏమైందంటే..?

Sekhar Master.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్ ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలోని పాటలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇకపోతే ఈయన ఇంట్లో మరొక విషాదం చోటుచేసుకుంది. ఒక సంఘటన గడవకముందే మరొక సంఘటన ఆయనను మరింత తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోందని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే తాజాగా శేఖర్ మాస్టర్ తమ్ముడు కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన తన ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ యాంకర్ అనసూయ కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ గుండె ధైర్యాన్ని నింపుకోవాలని, శేఖర్ మాస్టర్ తమ్ముడి ఆత్మకు శాంతి చేకూరాలని అనసూయ సంతాపాన్ని తెలియజేసింది.

Sekhar Master: Tragedy again in Sekhar Master's house.. What happened..?
Sekhar Master: Tragedy again in Sekhar Master’s house.. What happened..?

శేఖర్ మాస్టర్ తమ్ముడు మరణం..

ఇకపోతే శేఖర్ మాస్టర్ తన ఇంస్టా హ్యాండిల్ లో ఇలా రాసుకు వచ్చారు.. నిన్ను చాలా మిస్ అవుతున్నాను సుధా.. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నాకు నువ్వే గుర్తొస్తున్నావు.. నువ్వు చనిపోయావు అనే చేదు నిజాన్ని నేను తీసుకోలేకపోతున్నాను. ఎక్కడో ఒకచోట నువ్వు ఆనందంగా ఉంటావని అనుకుంటున్నాను. అయితే ఎప్పటికీ నువ్వు మాతోనే ఉంటావు.. మిస్ యు రా తమ్ముడు అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేస్తూ మరింత ఎమోషనల్ అయ్యారు శేఖర్ మాస్టర్. అయితే తమ్ముడి మరణానికి గల కారణాలను మాత్రం శేఖర్ మాస్టర్ వెల్లడించలేదు.

శేఖర్ మాస్టర్ ఇంట్లో ఇంకో విషాదం..

ఇదిలా ఉండగా ఏడాది ఏప్రిల్ లో శేఖర్ మాస్టర్ వదిన కన్ను మూసిన విషయం తెలిసిందే. జీవితంలో తనకు అన్నీ తోడై ఉండి అన్నివేళలా సహాయ సహకారాలు అందించిన తన వదినమ్మ మరణించేసరికి కృంగిపోయిన శేఖర్ మాస్టర్, ఇప్పుడు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే తమ్ముడు కూడా మరణించడంతో మరింత దిగ్బ్రాంతికి లోనవుతున్నారు. ఒకే ఏడాదిలో ఇలా ఇద్దరు ఇష్టమైన వ్యక్తులు మరణించేసరికి శేఖర్ మాస్టర్ బాధ వర్ణనాతీతం అని చెప్పవచ్చు. ఇక ఈ విషయం తెలిసిన పలువురు సెలబ్రిటీలు, అభిమానులు వారి ఆత్మకు శాంతి చేకూరుస్తూ శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్నారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు

- Advertisement -

శేఖర్ మాస్టర్ కెరియర్..

శేఖర్ మాస్టర్ కెరియర్ విషయానికి వస్తే ప్రముఖ బుల్లితెర ఛానల్ లో ప్రసారమైన ఢీ షో ద్వారా కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అల్లు అర్జున్ , రామ్ చరణ్, ఎన్టీఆర్, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ డాన్స్ మాస్టర్ గా కొనసాగుతున్నారు శేఖర్ మాస్టర్. ఇక ఇటీవల ఒక స్టార్ హీరో సినిమాకి కొరియోగ్రఫీ అందిస్తున్నారు శేఖర్ మాస్టర్. ఇక ప్రస్తుతం ఒకవైపు సినిమాలు మరొకవైపు బుల్లితెర షోలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా టాలీవుడ్ లో ఇంత పాపులారిటీ సంపాదించుకున్నారు భవిష్యత్తులో పాన్ ఇండియా సినిమాలకు కూడా పనిచేసే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Sekhar Vulli Vj (@sekharmaster)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు