Jabardast.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాస్యబ్రహ్మగా గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందం ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టి నవ్వించారు. ముఖ్యంగా వెయ్యికి పైగా చిత్రాలలో కామెడీ పాత్రలు చేసి గిన్నిస్ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు. ఇక బ్రహ్మానందం సినిమాలలో నటిస్తున్నారంటే ఎటువంటి సినిమా అయినా సరే నవ్వులు పండాల్సిందే. ముఖ్యంగా ఒక్కొక్కసారి ఈయన కామెడీ వల్ల కూడా సినిమాలు హిట్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వయసు మీద పడడంతో ఈమధ్య కాలంలో ఈయన సినిమాలు చాలా వరకు తగ్గాయి . కానీ ఒకప్పుడు బ్రహ్మానందం లేనిదే సినిమా లేదు అనేంతగా ఉండేది.ఈయన నటించిన సినిమాలలో ఇప్పటికీ కొన్ని చెరిగిపోని సినిమాలు కూడా వున్నాయి. అలాంటి వాటిలో పెదరాయుడు సినిమా ఒకటి. ఇందులో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇదిలా ఉండగా ఈ పెదరాయుడు సినిమాలో ఈయనకు జోడిగా నటించిన పాకీజా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇటీవలే జబర్దస్త్ లో పాల్గొని తన పరిస్థితి బాగోలేదని ఆర్థికంగా ఎవరైనా ఆదుకుంటే బాగుంటుందంటూ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈమె కాకుండా అదే సినిమాలో ఇంకో బ్రహ్మానందం భార్యగా నటించిన ఆమె గుర్తుందా. ఆమె కూతురు జబర్దస్త్ కమెడియన్ అంటూ ఒక వార్త హల్చల్ చేస్తోంది. మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.
సత్య శ్రీ తల్లి ఎవరంటే..
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమా సినిమాలలో బ్రహ్మానందం కామెడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా బ్రహ్మానందం, మోహన్ బాబు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు, సన్నివేశాలు కూడా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసేవారు. ముఖ్యంగా పెదరాయుడు సినిమా గురించి చెప్పుకోవాలి. ఇందులో రజనీకాంత్ అతిథి పాత్రలో నటించగా మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఒక సన్నివేశంలో బ్రహ్మానందం తాను ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని తండ్రి దగ్గరకు వచ్చే సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ సీన్లో బ్రహ్మానందం భార్యగా నటించిన ఆమె గుర్తుందా..? ఆమె ఎవరో కాదు జబర్దస్త్ లేడీ కమెడియన్ సత్య శ్రీ తల్లి.
సత్య శ్రీ కెరియర్..
సత్య శ్రీ జబర్దస్త్ ద్వారా మంచి పేరు సంపాదించుకుంది. చమ్మక్ చంద్ర స్కిట్స్ లో నటిస్తూ తన కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మధ్య చమ్మక్ చంద్ర బయటకు రావడంతో ఆమె కూడా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసి కొద్ది రోజులు సోషల్ మీడియాలో సందడి చేసింది. కానీ మళ్ళీ జబర్దస్త్ లోకి వెళ్లి బుల్లెట్ భాస్కర్ టీంలో సందడి చేస్తోంది. ఇక సత్య శ్రీ తల్లి విషయానికొస్తే పెదరాయుడు సినిమాతో పాటు ఇష్క్, ఆర్య 2 సినిమాలలో కూడా నటించింది . మరోవైపు కూతురు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆమె సినిమాలు చేయడం మానేశారు. ఈ విషయాలన్నింటినీ కూడా సత్య శ్రీ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. అంతేకాదు స్టార్ హీరోల సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.
View this post on Instagram