Janhvi Kapoor : అలాంటి రోల్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానంటున్న దేవర బ్యూటీ..

Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయిన హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు. అతిలోకసుందరి శ్రీదేవి – నిర్మాత బోణి కపూర్ ల గారాల కూతురుగా జాన్వీ కపూర్ కి ముందునుండే మంచి క్రేజ్ ఉంది. ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ తోనే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ త్వరలో టాలీవుడ్ ని ఏలడానికి రెడీ అవుతుందని తెలిసిందే. ఇక్కడ ఏకంగా రెండు పాన్ ఇండియా సినిమాలతో బిజీ అయింది. ఎన్టీఆర్ తో ఆల్రెడీ దేవరాలో నటిస్తుండగా, త్వరలో రామ్ చరణ్ RC16 సెట్స్ లో కూడా అడుగుపెట్టనుంది. ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ లేటెస్ట్ గా నటించిన బాలీవుడ్ మూవీ “ఉలఘ్” ఆగష్టు 2న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్బంగా జాన్వీ కపూర్ పలు ఆసక్తికర విషయాలను ఇంటర్వ్యూలో పంచుకుంది.

Janhvi Kapoor shares interesting facts about her films

అలాంటి రోల్స్ కే ఇంపార్టెన్స్ ఇస్తాను…

జాన్వీ కపూర్ లేటెస్ట్ గా ‘ఉలఘ్’ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో జాన్వీ తాను చేసే సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన లైఫ్ లో ముందు నుండి నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేస్తూ వచ్చానని, ఇప్పటివరకు ఒకటి అర తప్పా అన్ని సినిమాల్లో పాత్రలు తనకి ఎంతో పేరు తెచ్చాయని చెప్పుకొచ్చింది. అలాగే తనకు సవాళ్లతో కూడిన పాత్రలను చేయడం ఇస్తామని, బాగా రిస్కీ పాత్రలనే ఎంచుకుంటానని చెప్పుకొచ్చింది. అలాగే ప్రస్తుతం తన లైఫ్ లో సినిమా తప్ప మరో ప్రపంచం లేదని జాన్వీ చెప్పుకొచ్చింది. ఇక ‘ఉలఘ్’ సినిమా గురించి ప్రస్తావిస్తూ గ్లామర్ పాత్రలు చేసినపుడు సక్సెస్ తొందరగా వస్తుంది. మంచి క్రేజ్ వస్తుంది. కానీ నటనకు ప్రాధాన్యమున్న రిస్క్ తో కూడిన పాత్రలు చేసినప్పుడే మన సత్తా ఏంటో తెలుస్తుంది అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది చెప్పుకొచ్చింది.

- Advertisement -

దేశభక్తి నేపథ్యంలో ఉలఘ్..

ఇక జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించిన ఉలఘ్ సినిమా గురించి మాట్లాడుతూ తన కెరీర్లో రెండు హై రిస్క్ సినిమాలను ఎంచుకోగా, అందులో ఉలఘ్ సినిమా ఒకటి అని, ఈ సినిమా తన కెరీర్ ని మరో మలుపు తిప్పుతుందని కోరుకుంటున్నానని అంది. ఇక జాన్వీ నటించిన ఉలఘ్ మూవీ దేశభక్తి కథాంశం తో తెరకెక్కింది. ఇండియన్ ఫారెన్ సర్వీస్ నేపథ్యంలో సాగే ఒక థ్రిల్లర్ మూవీ గా ఆగష్టు 2న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇక జాన్వీ కపూర్ నటిస్తున్న దేవర సినిమాలో రెండో సాంగ్ ఈ వారం విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఆగష్టు చివరి వారం నుండి రామ్ చరణ్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొననుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు