Fashion : 16ఏళ్లకు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ అనౌన్స్ మెంట్!

Fashion : ప్రస్తుతం ఇండియా లో అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోందన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఒకే కథను రెండు భాగాలుగా తెరకెక్కే ట్రెండ్ నడుస్తుండగా, ఇప్పుడు పాత సినిమాలకు సీక్వెల్స్ తీసే ట్రెండ్ కూడా మొదలైనట్టుంది. ఇక రీసెంట్ గా కమల్ హాసన్ – శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్2 సినిమా ఏకంగా పాతికేళ్ల కింద వచ్చిన ఇండియన్ కి సీక్వెల్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు వచ్చిన రెండో పార్ట్ ప్లాప్ అయినా, దానికి మూడో పార్ట్ కూడా రానుంది. ఇక బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎప్పటినుంచో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ లో 16 ఏళ్ళ కింద వచ్చిన ఓ క్రేజీ సినిమాకి సీక్వెల్ రెడీ అవుతుంది.

Fashion Movie Sequel Announced by Madhur Bhandarkar

పదహారేళ్లకు ఫ్యాషన్ మూవీ సీక్వెల్ అనౌన్స్ మెంట్..

ఇక బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఫ్యాషన్ (Fashion) మూవీ గురించి అందరికి తెలిసిందే. 2008 లో ప్రియాంక చోప్రా, కంగ‌నా రనౌత్ మెయిన్ లీడ్ గా ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ గా తెరకెక్కిన సినిమా “ఫ్యాషన్”. ప్రముఖ దర్శకుడు మ‌ధురా బండ‌ర్కార్ తెరకెక్కించిన ప్యాష‌న్ సినిమా అప్పట్లో మంచి హిట్ అయింది. ఒక సాధారణ వ్య‌క్తి ప్యాష‌న్ రంగంలో సూప‌ర్ మోడ‌ల్ గా ఎద‌గాలంటే? ఎంత కష్టం దాగుందో, ఎదగడానికి ఎంత కృషి చేస్తారో, ఎన్ని కష్టాలు పడతారో అన్న నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఫ్యాషన్. ఇక ఈ సినిమాలో నటించిన ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్ ఉత్త‌మ న‌టి, ఉత్త‌మ స‌హాయ‌న‌టిగా ఏకంగా జాతీయ అవార్డులు సైతం అందుకున్నారు.

- Advertisement -

సీక్వెల్ అనౌన్స్ చేసిన మేకర్స్…

ఇక ఫ్యాషన్ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించారు. తాజాగా ఫ్యాషన్ సినిమాకి సీక్వెల్ ని అనౌన్స్ చేసారు మేకర్స్. ఈ సినిమాకి కొనసాగింపుగానే క‌థ‌ని దర్శకుడు మ‌ధుర బండార్క‌ర్ సిద్దం చేస్తున్నారు. నేటి జ‌న‌రేష‌న్ లో మోడ‌లింగ్ రంగం ఎలా ఉంది? ఇప్పుడెలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? అనే అంశాల ఆధారంగా ఫ్యాషన్ సీక్వెల్ తెరకెక్కనుందని సమాచారం. అయితే ఈ సీక్వెల్ లో కూడా కంగనా రనౌత్, ప్రియాంకా చోప్రా నటిస్తారా? లేదా కొత్త ఆర్టిస్టులను తీసుకుంటారా అన్నది తెలియాలి. నెటిజన్లు కూడా అప్ కమింగ్ హీరోయిన్లను తీసుకుంటే మోడలింగ్ పై సినిమా కాబట్టి, పర్ఫెక్ట్ గా సూట్ అవుతారని కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు