Mr Bachchan : జగపతి బాబు ఇంట్లో రవితేజ…?

Mr Bachchan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలను అద్భుతంగా తీర్చిదిద్దే డైరెక్టర్ ఎవరైన ఉన్నారా అంటే… విత్ అవుట్ డౌట్స్.. ఫస్ట్ వచ్చే పేరు హరీష్ శంకర్. అందుకు సాక్ష్యం గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్. అలాంటి పేరున్న డైరెక్టర్ ఇప్పుడు రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. దీనికి మూలం బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన రైడ్ సినిమా. సినిమా షూటింగ్ స్టార్టింగ్ లోనే రైడ్ కి రీమేక్ అని చెప్పారు. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. కానీ, రీమేక్ లను ఫ్యాన్స్‌కు మేకుల్లా గుచ్చనివ్వడు కదా.. హరీష్ శంకర్. అందుకే.. ఆయన సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అనుకున్నారు కొంత మంది. అయితే, ప్రస్తుతం ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తుంది. ఈ టాక్ మాస్ మహారాజా ఫ్యాన్స్ కు నిద్రపట్టనివ్వడం లేదు. ఏది ఏంటో ఇప్పుడు చూద్ధాం…

మిస్టర్ బచ్చన్ నుంచి ఓ టాక్ వస్తుంది. ఈ టాక్ ప్రకారం… సినిమాలో కొత్తదనం ఏమీ లేదట. బాలీవుడ్ రైడ్ ఎలా ఉందో… అచ్చం అలాగే ఈ మిస్టర్ బచ్చన్ ఉందని అంటున్నారు. సినిమా స్టార్టింగ్‌లో ఓ సీన్ ఉంటుందట.

హీరో… సినిమా ఓపెనింగ్‌లోనే పెళ్లి చూపులకు వెళ్తాడట. అది స్టార్టింగ్ లో కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉన్నా… తర్వాత విసుగు పుట్టించేలా ఉంటుందట. అప్పుడే ఓ ట్విస్ట్ ఉంటుందట. అప్పటి నుంచే సినిమా చూసేవాళ్లకు మనం ఏం చూస్తున్నామో అర్థమైపోతుందట.

- Advertisement -

జగపతి బాబు ఇంట్లో రవితేజ..

సినిమాలో హీరో ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ గా జగపతి బాబు కనిపిస్తున్నాడు. ఓ సందర్భంలో జగపతి బాబు ఇంటిపైన హీరో రైడ్ చేస్తాడట. ఈ రైడ్ దాదాపు 5 రోజుల పాటు సాగుతుందట. ఈ 5 రోజుల రైడ్‌లో జగపతి బాబు అక్రమంగా సంపాదించిన వేల కోట్లను రికవరీ చేస్తారట హీరో. అయితే ఈ సీన్ కూడా బోరింగ్ గా ఉంటుందట. ఈ రైడ్ అయిపోయాకా… జగపతి బాబు నుంచి రికవరీ చేసిన వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో క్లారిటీ కూడా సినిమాలో ఉండదని సమాచారం.

జగపతి బాబు లుక్…

మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌లో జగపతి బాబును చూపించారు. ఆ లుక్ చూస్తే జగపతి బాబు విలన్ గా చేసిన అరవింద సమేత వీర రాఘవ గుర్తుస్తుంది. సినిమాలో కూడా అరవింద సమేత వీర రాఘవలో బసి రెడ్డి పాత్ర లాగే ఈ సినిమాలో జగపతి బాబు పాత్ర ఉంటుందట. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలవరీ.. ఇలా అన్ని కూడా బసి రెడ్డి పాత్ర చూసినట్టే ఉంటుందని టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు