Deepika Padukone.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ గా నిలిచిన జంటలలో దీపికా పదుకొనే, రన్వీర్ సింగ్ జంట కూడా ఒకటి. 2019 లో వివాహం చేసుకున్న ఈ జంట.. ఇన్ని రోజులు వైవాహిక బంధంలో సంతోషంగా ఎంజాయ్ చేసిన ఈ జంట మరో రెండు నెలల్లో పండంటి బిడ్డకు ఆహ్వానం పలకబోతున్నారు. సెప్టెంబర్ లో దీపికా పదుకొనే తన బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈమెకు మగ బిడ్డ పుడుతుందని జ్యోతిష్యులు ఇప్పటికే తెలిపారు కూడా.. ఇక ఈమె గర్భవతి అని తెలిసిన తర్వాత కూడా ఈమె ఒప్పుకున్న సినిమాలన్నింటి షూటింగ్లను పూర్తి చేసింది. అంతే కాదు ఆ సినిమా ఈవెంట్లకు కూడా బేబీ బంప్ తో హాజరయ్యింది. ముఖ్యంగా బిడ్డ పుట్టిన తర్వాత రెండు సంవత్సరాలు బిడ్డ ఆలనా పాలనా చూసుకోవడం కోసం కొత్త సినిమాలను కూడా ప్రకటించడం లేదు. అందుకే అప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడింది దీపికా పదుకొనే.
ఘనంగా దీపికా పదుకొనే సీమంతం వేడుకలు…
ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు కుటుంబ సభ్యులు సీమంతం నిర్వహించినట్లు, అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.. అయితే ఈ ఫోటోలు చూస్తుంటే నిజంగా ఇక్కడ ఉన్నది దీపిక నేనా అనే అనుమానం కలుగుతుంది. సాంప్రదాయం ప్రకారం సీమంతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది . ఇలా చేయడం వల్ల పుట్టిన బిడ్డ బలం పుంజుకుంటుంది. ఈ సమయంలో కడుపులో పెరుగుతున్న శిశువు అనేక మంత్రాలతో, ఆచారాల, గ్రహ అనుకూలత లభిస్తుందని , ఏదైనా దోషం ఉంటే పోతుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు. అందుకే కడుపులో బిడ్డ ఉండగానే తల్లికి సీమంతం చేస్తారు కుటుంబ సభ్యులు. ఇక అందులో భాగంగానే వచ్చే నెలలో బిడ్డకు జన్మనివ్వబోతున్న దీపికాకు కూడా కుటుంబ సభ్యులు సీమంతం నిర్వహించారంటూ కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సీమంతం ఫోటోలు అసలైనవా లేక నకిలీవా అన్నవి తెలియాల్సి ఉంది.
దీపికా పదుకొనే కెరియర్..
ఇక దీపికా పదుకొనే కెరియర్ విషయానికొస్తే.. ఇటీవలే అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ వివాహ వేడుకల్లో బేబీ బంప్ తో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక్కడ కూడా సంప్రదాయంగా కనిపించి అందరి ప్రశంసలు అందుకుంది. ఇకపోతే గర్భం దాల్చిన తర్వాత అమ్మాయిలు బరువు పెరగడం సహజం.. కానీ దీపికా మాత్రం కాస్త పొట్ట ముందుకు రావడం తప్పించి ఆమె తన ఫిగర్ పోకుండా జాగ్రత్త పడుతోంది. మొత్తానికైతే తన ఫిజిక్ మైంటైన్ చేయడంలో ఎంతో శ్రమిస్తున్న దీపిక ఒకవైపు బిడ్డను కాపాడుకుంటూనే మరొకవైపు తన స్ట్రక్చర్ మైంటైన్ చేస్తూ ఉండడం పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇండస్ట్రీకి దూరం కానున్న దీపిక..
ఇకపోతే బిడ్డ పుట్టిన తర్వాత రెండేళ్లు సినీ ఇండస్ట్రీకి దూరం కాబోతోంది అని తెలిసి తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్న విషయం తెలిసింది. ఏది ఏమైనా బిడ్డ కోసం, బిడ్డ ఆలనా పాలన కోసం, మాతృత్వాన్ని పొందడం కోసం ఇలా రెండేళ్లు ఇండస్ట్రీకి దూరం కాబోతోంది దీపిక.