Allu Arjun.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గంగోత్రి సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన, ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఆర్య సినిమాతో వెను తిరిగి చూసుకోలేదు. అయితే ఇటీవల మళ్ళీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేసి అసలు బాలీవుడ్ లో మార్కెట్ లేని అల్లు అర్జున్ ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు పుష్ప సీక్వెల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
పుష్ప సినిమాతో బాలీవుడ్లో రూ.100 కోట్ల మా..
ఇకపోతే బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పుష్ప సినిమాకు ఎటువంటి ప్రమోట్ చేయకుండా, సినిమాను రిలీజ్ చేసి అక్కడ రూ.100 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించారు. దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ కి బాలీవుడ్ లో ఏ రేంజ్ లో పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా ఒక్క మాటతో బాలీవుడ్ ఇండస్ట్రీ పరువు మొత్తాన్ని తీసేశారు అల్లు అర్జున్..మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం
బాలీవుడ్ ఇండస్ట్రీ పరువు తీసిన బన్నీ..
తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నిఖిల్ అద్వానీ అసలు విషయాన్ని వెల్లడించారు. బాలీవుడ్ ఇండస్ట్రీ.. హీరోలను ఎలా చూపించాలో మరిచిపోయిందని అల్లు అర్జున్ తనతో చెప్పినట్లు ప్రముఖ డైరెక్టర్ నిఖిల్ అద్వానీ స్పష్టం చేశారు. ఇదే విషయంపై డైరెక్టర్ నిఖిల్ అద్వానీ మాట్లాడుతూ.. నేను అల్లు అర్జున్ తో ఒక సినిమా తీయాలనుకున్నాను. ఆ సినిమా గురించి ఆయనతో మాట్లాడుతుంటే, ఆయన మాత్రం నా వైపు చూసి అసలు బాలీవుడ్లో సమస్య ఏంటో మీకు తెలుసా? అక్కడ హీరోలు ఎలా ఉండాలో? ఎలా చూపించాలో? మీ ఇండస్ట్రీ మర్చిపోయింది అని ఒక్కసారిగా అన్నారు. దీంతో నేను ఆశ్చర్యపోయాను అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నిఖిల్ అద్వానీ.
ఆ ఉద్దేశంతోనే బన్నీ కామెంట్స్..
మొత్తానికి అయితే సౌత్ సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్లు హీరోలను చూపిస్తున్న తీరును ఇండైరెక్టుగా బన్నీ ప్రశంసించారంటూ ఇక్కడి వారు సంతోషపడుతుంటే.. బాలీవుడ్ డైరెక్టర్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే బాహుబలి లాంటి సినిమాలు సౌత్ నుంచి వచ్చే వరకు కూడా బాలీవుడ్ కి టాలీవుడ్ అంటే చిన్నచూపు ఉండేది. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలను చాలా తక్కువ చేసి చూశారు కూడా.. అయితే ఇప్పుడు ఒక్కసారిగా టాలీవుడ్ హీరోలు ఏకంగా గ్లోబల్ స్థాయి ఇమేజ్ దక్కించుకుంటుంటే జీర్ణించుకోలేకపోతున్నారు అని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. పైగా కొంతమంది బాలీవుడ్ బడా హీరోలు కూడా టాలీవుడ్ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే టాలీవుడ్ సినీ పరిశ్రమ ఏ రేంజ్ కి ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని బన్నీ ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.