Alanaati Ramachandrudu : అలనాటి రామచంద్రుడు రిలీజ్ కు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్… అడ్డంకులన్నీ క్లియర్

Alanaati Ramachandrudu : ఈ వారం బాక్స్ ఆఫీస్ పై చాలావరకు చిన్న సినిమాలే దండయాత్ర చేయబోతున్నాయి. అందులో అలనాటి రామచంద్రుడు అనే మూవీ కూడా ఒకటి. కానీ ఇప్పటిదాకా అసలు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అనే అనుమానాలు వచ్చాయి. తాజాగా సెన్సార్ తో సహా ఇబ్బందులన్నీ తొలిగిపోవడంతో ఈ మూవీ రిలీజ్ కు చివరి నిమిషంలో లైన్ క్లియర్ అయ్యింది.

తొలగిన సెన్సార్ అడ్డంకులు

యంగ్ హీరో కృష్ణ వంశీ హీరోగా, మోక్ష హీరోయిన్ గా నటిస్తున్న ఫీల్ గుడ్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అలనాటి రామచంద్రుడు. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను హైనివా క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీరామ్ జడబోలు, హైమావతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లాంటి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై కొంతవరకు ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీని పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆగస్టు 2న రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. కానీ మూవీ రిలీజ్ కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తిగాక పోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. సెన్సార్ సర్టిఫికెట్ చివరి నిమిషం దాకా జారీ కాకపోవడంతో అలనాటి రామచంద్రుడు మూవీ వాయిదా పడుతుందంటూ వార్తలు వచ్చాయి.

అయితే సెన్సార్ కార్యక్రమాలు లేట్ కావడానికి గల కారణమేంటో తెలియరాలేదు గాని ఎట్టకేలకు లాస్ట్ మినిట్ లో సెన్సార్ బోర్డు ఈ మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ ను జారీ చేసి రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ ను సెన్సార్ బృందం జారీ చేసింది. సినిమా రన్ టైం 155 మినిట్స్ ఉంది. దీంతో మొత్తానికి అలనాటి రామచంద్రుడు మూవీ థియేటర్లలోకి అడుగు పెట్టడానికి లైన్ క్లియర్ అయింది.

- Advertisement -

Image

సినిమాపై సెన్సార్ ఎఫెక్ట్

నిజానికి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే మూడు నాలుగు రోజుల ముందుగానే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చివరి నిమిషంలో ఎలాంటి హడావుడి లేకుండా జాగ్రత్త పడతారు. కానీ అలనాటి రామచంద్రుడు మూవీ టీం మాత్రం ప్రేక్షకులను గందరగోళంలో పడేసింది. అసలే చిన్న సినిమా. ఆపై సెన్సార్ సర్టిఫికెట్ రాలేదని వార్తలు కూడా రావడం ఈ సినిమాకు పక్కా మైనస్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా వాయిదా పడుతుందమే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దీంతో ఇంత ఆలస్యంగా సెన్సార్ ను పూర్తి చేసుకుని అనుకున్న సమయానికే రేపు థియేటర్లలోకి వచ్చినప్పటికీ మూవీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరి ఈ నష్టాన్ని మేకర్స్ ఎలా భర్తీ చేస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్న. ఇంత లో హైప్ ఉన్న ఈ చిన్న సినిమా సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో, ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఎంతవరకు రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మేకర్స్ అయితే కంటెంట్ తో హిట్ కొడతామనే నమ్మకంతో ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు