OTT Movie : ఎదురింటి వ్యక్తితో భార్య ఎఫైర్… ఈ హిలేరియస్ మలయాళ కామెడీ మూవీ ఏ ఓటిటీలో ఉందంటే?

OTT Movie : గత కొన్ని రోజుల నుంచి ఓటిటిలో కామెడీ సినిమాలకు డిమాండ్ బాగా పెరిగింది అని చెప్పాలి. ఈ నేపథ్యంలోని వారానికి ఒక్క కామెడీ మూవీ అయినా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. అలా రిలీజ్ అవ్వడమే కాదు ట్రెండింగ్ లో కూడా ఉంటుంది. ఇక కాసేపు మనసారా నవ్వుకోవాలి అనుకునే వారికి ఈ సినిమాలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. పైగా ఇలాంటి జానర్ సినిమాలు అంటే ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేకుండా ప్రశాంతంగా ఫ్యామిలీతో కలిసి సరదాగా కాసేపు నవ్వుకోవచ్చు. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇదొక మలయాళం కామెడీ ఎంటర్టైనర్. మరి ఈ ఇంట్రెస్టింగ్ కామెడీ ఎంటర్టైనర్ ను ఏ ఓటీటీలో చూడొచ్చు? స్టోరీ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రెండు ఓటిటీలలో స్ట్రీమింగ్..

ఇటీవల కాలంలో సినిమాలు ఒకేసారి ఎక్కువ ఓటీటీలలో అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ మూవీ మాత్రం విచిత్రంగా మూడు ఓటిటిలలో స్ట్రీమింగ్ కాబోతోంది. సూరజ్ వెరంజమూడు, బిజూ మీనన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ కామెడీ ఎంటర్టైలర్ నాదన్న సంభవం. విష్ణు నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 21న థియేటర్లలోకి వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకుల చేత సూపర్ హిట్ అనిపించుకున్న నాదన్న సంభవం మూవీ ఇప్పుడు ఓటిటి ఎంట్రీకి రెడీ అయింది. మనోరమ మ్యాక్స్, సింప్లీ సౌత్ అనే రెండు ఓటీటీలలో ఈ మూవీ ఆగస్టు 16 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. సినిమాలో ముఖ్యంగా బిజూ మీనన్ పాత్ర ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది.

Nadanna Sambavam | TV Time

- Advertisement -

స్టోరీ ఏంటంటే…

ముందుగా మేకర్స్ ప్రేక్షకులకు ఒక గేటెడ్ కమ్యూనిటీని పరిచయం చేస్తారు. అందులో శంకరన్ ఉన్ని, రోషి అనే భార్యాభర్తలు నివసిస్తూ ఉంటారు. సాధారణంగా భర్త జాబ్ చేస్తే భార్య ఇంట్లో ఉండి భార్య ఇల్లు చక్కబెడుతుంది. కానీ ఈ సినిమాలో మాత్రం శంకరన్ ఇంటి బాధ్యతలు చూసుకుంటే, భార్య జాబ్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వారికి ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో ధన్య, అజిత్ అనే మరో కొత్త జంట దిగుతారు. అయితే ఒకానొక సమయంలో శంకరన్, ధన్యకు మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయం కాస్త ధన్య భర్తకు అపార్థంగా అర్థం అవుతుంది. ఆ తర్వాత ఏకంగా శంకరన్ తో అజిత్ గొడవకు దిగుతాడు. అతన్ని చితకబాదుతాడు. దీంతో హీరో జైలుకి కూడా వెళ్లాల్సి వస్తుంది. మరి చివరికి భర్త అనాలోచితంగా, కోపంతో చేసిన పనికి భార్య ఎలా రియాక్ట్ అయింది? ఈ గొడవలు రెండు కుటుంబాల మధ్య ఎలాంటి పరిస్థితులకు దారి తీసాయి? ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలకు ఎలా ఎండ్ కార్డు పడింది ? అనే విషయం తెలియాలంటే నాదన్న సంభవం అనే ఈ హిలేరియస్ సినిమాను చూసి తీరాల్సిందే. ఇందులో కామెడీ మాత్రమే కాదండోయ్ యాక్షన్, ఎమోషన్ వంటి అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు