Shivam Bhaje Movie Review : ‘శివం భజే’ మూవీ రివ్యూ

Shivam Bhaje Movie Review : ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా ‘శివం భజే’ అనే సినిమా రూపొందింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆ సినిమా. ఈరోజు అశ్విన్ బాబు పుట్టినరోజు, అలాగే ఈ సినిమా నిర్మాత మహేశ్వరరెడ్డి పుట్టినరోజు కూడా..! మరి వీరిద్దరికీ ఈ సినిమా ఈరోజు ఎలాంటి అనుభవాన్ని మిగిల్చిందో తెలుసుకుందాం రండి :

కథ : చంద్రశేఖర్ అలియాస్ చందు (అశ్విన్ బాబు) రికవరీ ఏజెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. లోన్ తీసుకుని ఈఎంఐ కట్టడం ఎగ్గొడుతున్న వాళ్ళని చితకబాది, ముక్కు పిండి వసూల్ చేయడం ఇతనికి అలవాటు. అతని ఉద్యోగంలో భాగంగానే అతనికి శైలజ(దిగంగన సూర్యవంశీ) అనే మెడికల్ స్టూడెంట్ తో పరిచయం ఏర్పడుతుంది.మరోపక్క ఓ బ్యాచ్ కి అతను టార్గెట్ అవుతాడు. వాళ్ళ వల్ల ఇతని కంటి చూపు పోతుంది. ఆ తర్వాత ఓ కాలేజ్ స్టూడెంట్ చనిపోవడంతో.. ఇతని కంటి చూపుకి డోనర్ దొరికినట్టు అవుతుంది. కానీ అతనికి కంటి చూపు మళ్ళీ వచ్చినప్పటి నుండీ చిత్ర విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. మరోపక్క అరుణాచల్ ప్రదేశ్ వద్ద ఉన్న ఓ ప్రదేశం పై చైనా కన్నువేస్తుంది. అందుకు ఇండియన్ మిలిటరీ అడ్డుగా ఉందని భావించి.. దాని దృష్టి మళ్లించేందుకు కుట్ర పన్నుతుంది. అది ఏంటి? మధ్యలో ఏసీపీ మురళి (అర్భాజ్ ఖాన్) శైలజలైఫ్ లోకి ఎందుకు వచ్చాడు. ఈ ప్రశ్నలకి సమాధానమే ‘శివం భజే’ సినిమా.

విశ్లేషణ: కొద్దిరోజులుగా మైథాలజీ టచ్ ఉన్న సినిమాలు.. సో సోగా ఉన్నా తెగ ఆడేస్తున్నాయి. కాబట్టి.. చిన్న సినిమాల మేకర్స్ కూడా ఏదో ఒక సీన్లో దేవుణ్ణి చూపించేసి హిట్టు కొట్టేద్దాం అనే ఆలోచనకి వచ్చేసినట్టు ‘శివం భజే’ సినిమా క్లారిటీ ఇచ్చేసింది.అప్సర్ అనే ఓ ముస్లిం దర్శకుడు తీసిన సినిమా ఇది. గతంలో ఇతను ‘గంధర్వ’ అనే ఓ చిన్న సినిమా తీశాడు. అది వచ్చి వెళ్లినట్టు చాలా మందికి తెలీదు. అయినా సరే అశ్విన్ బాబు ఛాన్స్ ఇచ్చాడు. నిజం చెప్పాలంటే.. అశ్విన్ బాబు సినిమాలు థియేట్రికల్ గా చాలా వరకు రికవరీ చేస్తుంటాయి. అందుకే అతను ఆచి తూచి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే అప్సర్ ప్లాప్ దర్శకుడు అని తెలిసినా ఛాన్స్ ఇచ్చాడు. అతని ధైర్యానికి అయితే మెచ్చుకోవచ్చు.. కానీ ఓ ముస్లిం దర్శకుడితో మైథాలజీ సినిమా అంటే.. అతను చేసింది పెద్ద రిస్క్ అనే చెప్పాలి. ఆ రకంగా ‘శివం భజే’ ప్రత్యేకతను సంతరించుకుంది అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ పోర్షన్ అంతా చాలా చిరాగ్గా ఉంటుంది. అర్ధం పర్థం లేని కామెడీ సీన్స్ బి,సి సెంటర్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారేమో కానీ.. మల్టిప్లెక్స్ ఆడియన్స్ కి రుచించదు. అయితే ఎప్పుడైతే హీరోకి కంటిచూపు పోతుంది అక్కడి నుండీ సినిమా గ్రిప్పింగ్ గా మారుతుంది. సెకండాఫ్ లో కొన్ని లాజిక్స్ మిస్ అయినా క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ వరకు సినిమా ఎంగేజ్ చేస్తుంది. అయితే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్.. విలన్ కోసం పెట్టిన ఫజిల్ తేలిపోయింది. సాంకేతికంగా సినిమాకి బడ్జెట్ ఎక్కువైంది అని చెప్పారు మేకర్స్. కానీ అంత గొప్పగా అయితే విజువల్స్ ఏమీ కనిపించవు. సినిమాటోగ్రఫీ కూడా జస్ట్ ఓకే. వికాస్ బాడిస బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.

- Advertisement -

నటీనటుల విషయానికి వస్తే..

అశ్విన్ బాబు సంపూర్ణ నటుడిగా ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. ఈ సినిమాలో కొన్ని చోట్ల ఓకే అనిపించినా.. చాలా చోట్ల ఇబ్బంది పడుతూ నటించినట్టు తెలిసిపోతుంది. ఫైట్స్ సీక్వెన్స్..లో అతను ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. హీరోయిన్ దిగంగన సూర్యవంశీ మంచి పెర్ఫార్మర్. సరైన సినిమా పడితే.. ఈమె రేంజ్ పెరుగుతుంది. కానీ సరైన పాత్రలు ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత ఈమె పై ఉంది. ఈ సినిమాలో ఆమె నటన బాగుంది. గ్లామర్ వలకబోయడానికి మాత్రం పెద్దగా స్కోప్ దొరకలేదు. హైపర్ ఆది కామెడీ విసిగిస్తుంది. స్క్రీన్ పై అతని నోరే కదులుతుంది తప్ప.. అతనికి క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి నటించడం రావడం లేదు. ఫ్లూక్ లో నెట్టుకొస్తున్నాడు. అది ఎన్నాళ్ళు వర్కౌట్ అవుతుందో చూడాలి. బ్రహ్మాజీ పాత్ర పర్వాలేదు. అతను కూడా బాగా నటించాడు. మిగిలిన నటీనటుల పాత్రలు పెద్దగా ఇంపాక్ట్ చూపించవు

ప్లస్ పాయింట్స్ :

స్టోరీ లైన్

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

సెకండాఫ్ స్టార్టింగ్ పోర్షన్

మైనస్ పాయింట్స్ :

మొదటి అరగంట

చివరి అరగంట

లాజిక్ లెస్ సీన్స్

మొత్తంగా.. ‘శివం భజే’ హీరో ప్రమోషన్లో చెప్పినంత రేంజ్లో అయితే మోగలేదు.

రేటింగ్ :2/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు