Kanguva : మూవీ నుంచి కార్తీ పాత్ర లీక్… లోకీ మిస్ చేసింది ఇక్కడ సాధ్యమవుతుంది

Kanguva : కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న “కంగువ” చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. కంగువ సినిమాని తమిళ దర్శకుడు శివ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. స్టూడియో గ్రీన్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా 200 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలుకొని టీజర్ తో సూర్య అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకులలో కూడా ప్రకంపనలు సృష్టిస్తుంది. పీరియాడిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య ఒక తెగకు చెందిన వారియర్‌గా, బాబీ డియోల్ మరో తెగకు చెందిన విల‌న్‌ గా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా సూర్య కంగువ సినిమాలో ఓ స్టార్ హీరో కూడా నటిస్తున్నాడని లేటెస్ట్ గా లీక్ అయింది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు సూర్య తమ్ముడు కార్తీ.

Karthi's role in Suriya's Kanguva movie

కంగువ లో కార్తీ కీ రోల్..

ఇక లేటెస్ట్ గా కంగువ (Kanguva) చిత్ర యూనిట్ నుండి లీక్ అయిన సమాచారం ఏంటంటే, ఈ సినిమాలో సూర్య తమ్ముడు కార్తీ ఒక క్రేజీ రోల్ చేస్తున్నాడట. ఇక కార్తీ పాత్ర సూర్యని ఢీ కొట్టే రేంజ్ లో పవర్ ఫుల్ గా ఉంటుందట. సినిమాకి అది హైలెట్ గా మారనుందని తెలుస్తుంది. ఈ సినిమాలో కార్తీ విలన్ గా నటిస్తున్న బాబీ డియోల్ – సెకండ్ వైఫ్ కొడుకు పాత్ర అని సమాచారం. అయితే అది ఒక ట్విస్ట్ గా ఉంచబోతున్నారని, సూర్య – బాబీ డియోల్ ఫైనల్ వార్ అయ్యేటపుడు కార్తీ ఎంట్రీ ఇస్తాడని సమాచారం.

- Advertisement -

లోకి మిస్ చేసింది.. ఇక్కడ సాధ్యమయింది..

అయితే కోలీవుడ్ స్టార్లు అన్నదమ్ములైన సూర్య – కార్తీ ని తెరపై ఒకే ఫ్రేమ్ లో చూడాలని ఎప్పట్నుంచో అభిమానులు కోరుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఈ కాంబోని సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక విక్రమ్ లో రోలెక్స్ గా సూర్య ఎంట్రీ ఇచ్చాక సూర్య – కార్తీ కాంబో పై చర్చ పీక్స్ కి చేరింది. ఖచ్చితంగా రోలెక్స్ – ఢిల్లీ లను తెరపై లోకేష్ కనగరాజ్ చూపిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ లోకేష్ కానగరాజ్ వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకవేళ లోకి వీళ్ళని ఒకే ఫ్రేమ్ లో చుపించాలన్నా మరో రెండేళ్లు పట్టేలా ఉంది. అయితే లోకేష్ మిస్ చేసింది, డైరెక్టర్ శివ కంగువ లో చేసి చూపించాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అన్నదమ్ముల్ని ఒకే ఫ్రేమ్ లో చూడాలన్న కలను శివ కంగువ తో నిజం చేస్తున్నాడని తెలుస్తుంది. మరి కంగువ లో సూర్య – కార్తీ స్క్రీన్ ప్రెజెన్స్ ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు