Kalki 2898AD: కల్కి సినిమా చూడని వారికి శుభవార్త.. రూ.100 కే టికెట్.. ఆఫర్ ఎక్కడంటే..?

Kalki 2898AD.. బాహుబలి సినిమా తర్వాత అన్ని పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న రెబెల్ స్టార్ ప్రభాస్.. గత ఏడాది సలార్ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఏడాది భారీ అంచనాల మధ్య రూ.700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం కల్కి 2898AD. ప్రభాస్ హీరోగా, దిశాపటాని , దీపికా పదుకొనే హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో అశ్వద్ధామ గా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన అద్భుతమైన నటనతో సినిమాను పీక్స్ కి తీసుకెళ్లిపోయారు. అలాగే విభిన్నమైన రూపంతో యాస్కిన్ పాత్రలో కమలహాసన్ అదరగొట్టేసారని చెప్పాలి. ముఖ్యంగా ఇందులో నటించిన ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Kalki 2898AD: Good news for those who haven't seen the movie Kalki.. Rs.100 k ticket.. Where is the offer..?
Kalki 2898AD: Good news for those who haven’t seen the movie Kalki.. Rs.100 k ticket.. Where is the offer..?

రూ.100 కే కల్కి టికెట్..

విడుదలైన అతి తక్కువ సమయంలోనే 1000కోట్ల క్లబ్లో చేరిపోయింది ఈ సినిమా. ఇక పాన్ ఇండియా రేంజ్ లో సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని, అంతకుమించి కలెక్షన్లు రాబట్టిందని చెప్పవచ్చు. ఇకపోతే వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ ఆయన కుమార్తెలు ప్రియాంక దత్, స్వప్న దత్ చిత్రాన్ని నిర్మించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపికి అత్యంత సన్నిహితుడైన అశ్వినీ దత్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి టికెట్లు రేట్లు పెంచిన విషయం తెలిసిందే. అయితే టికెట్లు ధరలు పెరగడంతో చాలామంది సామాన్య ప్రజలు కల్కి సినిమాను థియేటర్ కు వెళ్లి చూడలేకపోయారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కల్కి ఇంకా చూడని వారికి చిత్ర బృందం శుభవార్త తెలిపింది. టికెట్ ను కేవలం 100 రూపాయలకే అందిస్తూ చక్కటి గుడ్ న్యూస్ తెలిపిందని చెప్పవచ్చు.

ఆఫర్ ఎక్కడంటే..

అయితే ఈ ఆఫర్ ఎక్కడ ఉంది అనే విషయానికొస్తే.. భారతదేశం అంతటా సినిమా థియేటర్లలో రూ .100 రూపాయలకే ఆగస్టు 2 అంటే నేటి నుండి ఒక వారం పాటు సినిమా అందుబాటులో ఉంటుందని చిత్ర బృందం వెల్లడించింది . కాబట్టి సినిమాని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్లలోనే చూడాల్సిందిగా సినిమా యూనిట్ కూడా స్పష్టం చేసింది.ప్రస్తుతం ఈ సినిమా 1200 కోట్ల కలెక్షన్లు రాబట్టి తదుపరి మైల్ స్టోన్ దిశగా పరుగులు పెడుతోంది. ఇక అందులో భాగంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ముఖ్యంగా దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సినిమాను థియేటర్లలో చూడాలన్న ఉద్దేశంతోనే వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీ దత్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

- Advertisement -

ఫ్యామిలీతో థియేటర్ కి..

ఈ విషయం తెలిసి ఇంకా సినిమా చూడని వారు ఫ్యామిలీతో సహా సినిమా థియేటర్లకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కల్కి టికెట్లు రేట్లు భారీగా తగ్గించి చిత్ర బృందం తీసుకున్న నిర్ణయానికి సినీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు