Prashanth : ట్రాఫిక్ రూల్స్ పాటించని కోలీవుడ్ స్టార్.. షాకిచ్చిన పోలీసులు!

Prashanth : ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడప్పుడూ సెలెబ్రిటీలు కూడా తప్పులు, పొరపాట్లు చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. కొన్ని సార్లు ఆ మిస్టేక్స్ వల్ల బాగా ట్రోల్ అవుతారు. స్టార్ హీరోలైతే క్షణాల్లో వైరల్ అవుతారు. అలాగే ఓ కోలీవుడ్ స్టార్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా, ఆ నటుడికి పోలీసులు షాకిచ్చారు. ఆ హీరో ఎవరో కాదు జీన్స్ ఫేమ్ ప్రశాంత్. తమిళ నటుడు ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 90స్ హీరోస్ లో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో, అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసాడు. ఇక సౌత్ ఇండియా వ్యక్తంగా అప్పట్లో ‘జీన్స్’ సినిమాతో ఓ వెలుగు వెలిగాడు. ఆ తర్వాత కూడా జోడి వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ప్రశాంత్, ఆ తర్వాత సక్సెస్ ని కంటిన్యూ చేయలేకపోయాడు. ఇక ఇప్పుడు ఇతర స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ, అడపాదడపా హీరోగా సినిమాలు చేస్తున్నాడు.

Police fined Kollywood actor Prashanth Rs 2000 for violating traffic rules

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన హీరో..

ఇక అసలు విషయానికి వస్తే.. నటుడు ప్రశాంత్ (Prashanth) కు తాజాగా చెన్నై పోలీసులు జరిమానా విధిస్తూ షాకిచ్చారు. రీసెంట్ గా ప్రశాంత్ తన బులెట్ బైక్ పై ప్రయాణిస్తూ, ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అయితే ఆ బైక్ నడుపుతున్న ప్రశాంత్ హెల్మెట్ ధరించలేదు. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతూ ఇంటర్వ్యూ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఆ ఇంటర్వ్యూ వీడియో కూడా వైరల్ అయింది. దీంతో బైక్ నడిపిన నటుడు ప్రశాంత్ కు, వెనుక ఉన్న పిలియన్ రైడర్ కు హెల్మెట్ లేదని చెన్నై పోలీసులు రూ.2000 జరిమానా విధించారు. ఈ విషయాన్నీ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేసారు.

- Advertisement -

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ..

ఇక నటుడు ప్రశాంత్ పదేళ్ల ముందు వరకు కూడా హీరోగా సినిమాలు చేసి, వరుస ఫెయిల్యూర్స్ తో ఫేడవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యాడు. ఇక ఆ మధ్య తెలుగులో రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో కూడా నటించాడు. ప్రస్తుతం దళపతి విజయ్ గోట్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే మరో రెండు తమిళ సినిమాలు చేస్తున్నాడు. ఇక మంచి పాత్ర వస్తే తెలుగులో కూడా చేస్తానని పలు మార్లు చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు