Sharwa36 : క్రేజీ రేస్ ఎపిసోడ్ ఫినిష్ చేసిన మేకర్స్.. ఎక్కడో తెలుసా?

Sharwa36 : టాలీవుడ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. పెళ్లి అయ్యాక రెండేళ్లు గ్యాప్ తీసుకున్న శర్వా, రీసెంట్ గా ‘మనమే’ సినిమాతో డీసెంట్ కం బ్యాక్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత కూడా వరుస ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు. ఇప్పుడు ఒకేసారి మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు శర్వానంద్. మూడు ప్రాజెక్టులు కూడా ఒకేసారి సెట్స్ పైకి తీసుకువచ్చి, షెడ్యూల్ ప్రకారం మూడు సినిమాలని కూడా పూర్తి చేస్తున్నాడు. ఇదిలా ఉండగా లేటెస్ట్ గా శర్వానంద్ (Sharwa36) యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అప్ కమింగ్ మూవీ ని అభిలాష్ రెడ్డి అనే డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి షూటింగ్ కి సంబంధించి తాజా అప్డేట్ వచ్చింది.

Sharwanand's Sharwa36 project Indonesia schedule is complete

క్రేజీ రేస్ ఎపిసోడ్ ఫినిష్ చేసిన శర్వా..

ఇక శర్వానంద్ నటిస్తున్న తన 36వ సినిమాలో శర్వా ఒక బైక్ రేసర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా యూనిట్ తాజాగా ఒక క్రేజీ బైక్ రేస్ సీన్ ఎపిసోడ్ ని పూర్తి చేసారు. అయితే అది ఇక్కడ ఇండియాలో తెరకెక్కించలేదు. ఇండోనేషియాలో బైక్ రేసులు జరిగే ప్రాంతంలో భారీ ఖర్చుతో ఆ సీన్ షూట్ చేశారట. సినిమాలో హైలెట్ సీన్లలో ఇది ఒకటిగా నిలుస్తుందని సమాచారం. ఇక ఎపిసోడ్ ని తాజాగా చిత్ర యూనిట్ ముగించగా, త్వరలోనే ఇండియాకి రానున్నారట. ఇక శర్వానంద్ రాగానే, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ (Sharwanand37) షెడ్యూల్ లో జాయిన్ అవుతాడని సమాచారం.

- Advertisement -

శర్వా సినిమాలో యాంగ్రీ యంగ్మెన్..

ఇదిలా ఉండగా శర్వా నటిస్తున్న ఈ సినిమాను అభిలాష్ రెడ్డి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. చాలా టైంగా మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న రాజశేఖర్ కి ఈ సినిమా ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని అంటున్నారు. పైగా ఈ సినిమాలో స్పెషల్ రోల్ కి రాజశేఖర్ ఏకంగా 1.50 కోట్ల రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు