Shivam Bhaje Tickets Booking : బుక్ మై షోలో ఫేక్ అకౌంట్స్‌తో ఫేక్ రివ్యూలు ఫేక్ ఓటింగ్స్… ఇదంతా నిజమేనా…?

Shivam Bhaje Tickets Booking.. ప్రముఖ యాంకర్ ఓంకార్ సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అశ్విన్ బాబు రాజు గారి గది సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మెప్పించిన అశ్విన్, చివరిగా హిడింబ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆకట్టుకున్నారు. ఇందులో హీరో కం విలన్ గా నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. హిడింబ చిత్రం ఇప్పటికీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోంటూనే ఉంది. ఇక ఇప్పుడు తాజాగా శివం భజే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జీరో ట్రాన్స్ ప్లాంటేషన్ అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అశ్విన్ బాబు కుటుంబం, నేర నేపథ్యం, పరిశోధన, దైవిక సంబంధమైన అంశాలు, సైన్స్ ఇలా నాలుగైదు జానర్లను ఒకే సినిమాలో కలగలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

Shivam Bhaje Tickets Booking : Fake Reviews Fake Votings with Fake Accounts on Book My Show... Is All This Real...?
Shivam Bhaje Tickets Booking : Fake Reviews Fake Votings with Fake Accounts on Book My Show… Is All This Real…?

అయితే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ పెద్దగా మెప్పించలేదని చెప్పాలి. ముఖ్యంగా ఇందులో ఏ ఒక్క దానికి కూడా పరిపూర్ణమైన న్యాయం జరిగినట్టు అనిపించలేదు. మొత్తంగా చూస్తే కథ ఆలోచన ఆసక్తికరమైనదే కానీ తెరపైకి తీసుకొచ్చిన తర్వాత సినిమా డిజాస్టర్ గా మారింది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిపైన ఎలాంటి ప్రభావం చూపించలేదు. అసలు సినిమాను తెరపై చూపించిన తీరు కూడా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇక ఫస్ట్ ఆఫ్ కథ పక్కన పెడితే సెకండ్ హాఫ్ లో హీరోకి వచ్చే జ్ఞాపకాలతోనైనా నేరస్తుల్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే.. లేదు.. తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు.. ట్రాన్స్ ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే.. దీని గురించి ఒక పెద్ద చరిత్ర చెప్పారు కానీ దానిని విశ్లేషించడంలో విఫలమయ్యారు.

అశ్విన్ స్ట్రాటజీ.. దొంగ లెక్కలు..

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తాజాగా ఆ పోస్టర్ చూస్తుంటే ఇదెక్కడి లెక్కలు రా బాబు అంటూ నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.. బుక్ మై షో లో ఇప్పటివరకు గత 24 గంటల్లోనే 5.5K టికెట్లు బుక్ అయినట్లు పోస్టర్లో రివీల్ చేశారు. అంతేకాదు ప్రజల నుంచి 9.4 K ఓట్లు వచ్చాయని , ఇప్పటివరకు రివ్యూల సంఖ్య 8.6 K అని ఇలా ఎక్కడా కూడా ట్యాలీ లేని లెక్కలు చూపించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇదంతా అశ్విన్ బాబు ఆయన టీమ్ మార్కెటింగ్ స్ట్రాటజీ చేశారా? లేదా బుక్ మై షో లో దొంగ అకౌంట్స్ చేస్తున్న స్ట్రాటజీనా అంటూ కొంతమంది మండిపడుతున్నారు..

- Advertisement -

దొంగ పోస్టర్లతో ఆకర్షిస్తారా..

నిజానికి పబ్లిక్ రేటింగ్ 9.3K అని చూపించడం ఇక్కడ మరింత అనుమానాలకు దారితీస్తోంది.. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు పైగా వందల కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమాలకు కూడా ఒక రోజులో ఇంత రేటింగ్ రాదు.. అలాంటిది ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించ లేకపోయిన ఈ సినిమాకి ఇంత రేటింగ్ ఏంటి అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు . ఏది ఏమైనా అశ్విన్ బాబు అండ్ టీం సక్సెస్ లేక ఇలాంటి కొత్త దారులు తొక్కుతున్నారా.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఇది కూడా ఒక మార్గమా అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు