Shivam Bhaje : శివ శివ.. ఏం కష్టాలు సామి… అశ్విన్ బాబు సినిమా షోలు క్యాన్సిల్

Shivam Bhaje : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో అశ్విన్ బాబు ఒకరు. ఓంకార్ దర్శకుడుగా పరిచయమైన జీనియస్ అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు అశ్విన్. జీనియస్ సినిమా అప్పట్లో డీసెంట్ హిట్ గా నిలిచింది. చిన్నికృష్ణ అందించిన కథకు దర్శకుడుగా న్యాయం చేశాడు ఓంకార్. ఆ సినిమాతో కేవలం అశ్విన్ మాత్రమే కాకుండా చాలామంది వెండితెరకు పరిచయం అయ్యారు. ఓంకార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రియాల్టీ షో నిర్వహించడంలో ఒకప్పుడు ముందు వరుసలో ఉండేవారు. చాలామందికి లైఫ్ ఇచ్చారు ఓంకార్.

ఇకపోతే అశ్విన్ బాబు జీనియస్ సినిమా తర్వాత జతకలిసే, రాజుగారిగది వంటి సినిమాల్లో కూడా కనిపించాడు. కొన్ని సినిమాల్లో కనిపించిన కూడా ఇప్పటివరకు సరైన బ్రేక్ అంటూ తనకు రాలేదు అని చెప్పాలి. అయితే తెలుగు ప్రేక్షకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సినిమా బాగుంది అని అంటే నటులతో సంబంధం లేకుండా ఆ సినిమాని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. బహుశా అశ్విన్ బాబు కెరియర్ లో ఇప్పటివరకు మంచి కాన్సెప్ట్ బేస్ సినిమా చేయకపోవడం వల్లనే ఇప్పటివరకు సరైన గుర్తింపు లభించలేదు.

Shivam Bhaje

- Advertisement -

ఇకపోతే రీసెంట్ గా తన పుట్టినరోజు సందర్భంగా శివం భజే అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించిన ఫలితాన్ని రాబట్టుకోలేక పోతుంది అంటూ కథనాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి తెలుగు స్టేట్స్లో చాలావరకు షోస్ క్యాన్సిల్ అయినట్లు సమాచారం వినిపిస్తుంది. ఇకపోతే ఒక సినిమా బాగుంది అని అంటే కచ్చితంగా పాజిటివ్ టాక్ వస్తుంది. కానీ ఈ సినిమాకి ఎక్కడా పాజిటివ్ టాక్ కనిపించడం లేదు. ఈ సినిమాకి సంబంధించి కొద్దిపాటి నెగిటివ్ టాక్ వినిపిస్తుంది. థియేటర్లో చాలా తక్కువ మంది ఆడియన్స్ ఉండటం వలన షో స్ క్యాన్సిల్ చేస్తున్నారు థియేటర్ యాజమాన్యం. ఇకపోతే ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎనిమిది కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇక రెండవ రోజుకి ఇలాంటి టాకు నడుస్తున్నప్పుడు ఈ సినిమా ఆ కలెక్షన్స్ వసూలు చేయడం కష్టమని తెలుస్తుందని సినీ ప్రముఖులు విశ్లేషిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు