Chinmayi: కూతుర్ని కూడా తండ్రి హత్తుకోకూడదా.. చిన్మయి వాదనపై సైకియాట్రిస్ట్ విశ్లేషణ..!

Chinmayi.. ప్రముఖ సింగర్ చిన్మయి మహిళలపై, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు తనదైన శైలిలో సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రముఖ కోలీవుడ్ నటులపై సంచలన కామెంట్లు చేసిన ఈమె ఇటీవల ప్రముఖ యాంకర్ అనసూయ షో లో భాగంగా పిల్లవాడి తో తన పెదాలపై ముద్దు పెట్టించుకోవడం కూడా తప్పే అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. దీనికి కూడా యాంకర్ అనసూయ సరైన రీతిలో ఘాటు సమాధానం చెప్పింది .ఈ విషయం పక్కన పెడితే నిన్నటికి నిన్న ఒక తండ్రి కూతుర్ని హగ్ చేసుకోకూడదు అంటూ చేసిన కామెంట్లు నెటిజన్స్ ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల అనుమతి లేకుండా వారిని ముట్టుకోవడం, పట్టుకోవడం వంటివి చేయకూడదు అని సొంత పిల్లల్ని ప్రేమతో తాకడం, హగ్ చేసుకోవడం కూడా తప్పు అంటూ ఈమె చెప్పడంతో ఈ విషయంపై నెటిజెన్లు వాదిస్తున్నారు. అయితే ఈ వాదన పై ప్రముఖ సైకియాట్రిస్ట్ మిర్యాల శ్రీకాంత్ సింపుల్ విశ్లేషణ ఇచ్చారు మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.

Chinmayi: A father should not touch his daughter too.. Psychiatrist analysis on Chinmayi's claim..!
Chinmayi: A father should not touch his daughter too.. Psychiatrist analysis on Chinmayi’s claim..!

అలాంటి సమయంలో పిల్లలను తాకకూడదు..

తాకిడి. పిల్లల శారీరక , మానసిక వికాసానికి.. కరచాలనం, కౌగిలింతలు , మర్దన, స్పర్షతో కూడిన ఆటలు కబడ్డీ వంటివి కితకితలు, అభినందనలతో కూడిన వీపు చరచడం ఇవన్నీ కూడా అవసరం. వీటన్నింటినీ పరిచయం చేయడం తల్లిదండ్రుల బాధ్యత.. అయితే ఇవి ఏమాత్రం కూడా తప్పు కాదు.. కానీ పిల్లలు కొన్నిసార్లు కొన్ని రకాల స్పర్శలను వద్దనుకుంటారు. ఉదాహరణకు చేత్తో తోయడం, తల తిప్పడం, వద్దని చెప్పడం లాంటివి చేస్తూ ఉంటారు. దానిని మనం గౌరవించి, పిల్లల మనోభావాలను అర్థం చేసుకోవాలి. కానీ అలా అని అది ఎప్పటికీ ఇష్టం కాదని కూడా గమనించాలి. కావాలంటే మళ్ళీ ప్రయత్నించవచ్చు. పిల్లలకు స్నానం చేయడం, పళ్ళు తోమడం, బట్టలు మార్చడం లాంటివి వాళ్లు వద్దన్నా కూడా మనం చేస్తాము. అయితే అవి చేసే ముందు పిల్లలతో నేను ఇది చేస్తున్నాను అని చెప్పాలి. సబ్బు వాళ్ళనే రాసుకోమని చెప్పడం బట్టలు ఎంచుకోమనడం లాంటి పనుల వల్ల పిల్లల్లో ఆసక్తి కలిగించవచ్చు. ముఖ్యంగా కొన్నిసార్లు పిల్లలు చిరాగ్గా ఉన్నప్పుడు వాళ్లను ఏ పనికి బలవంతం చేయకపోవడమే మంచిది.

గుడ్ టచ్ బ్యాడ్ టచ్..

అలాగే పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేవి మూడు సంవత్సరాల వయసు నుంచి నేర్పించాలి. బొమ్మ ద్వారా కూడా పిల్లలకు నేర్పించవచ్చు. ఛాతీ , పిరుదులు, పెదాలపై ముద్దు, తొడ లోపలి భాగం, జననేంద్రియాలు ముట్టుకోవడం లాంటివి నిషిద్ధం. కచ్చితంగా ఇది పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించి తీరాలి. స్నానం చేసేటప్పుడు, శుభ్రం చేసుకునేటప్పుడు వైద్యుడు పరీక్షించేటప్పుడు తప్ప ఇక ఏ సందర్భంలో కూడా ఎవరు ఇక్కడ ముట్టాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా ఆటపట్టించడానికి తల్లిదండ్రులే కాదు ఇంకెవరు కూడా ముట్టకూడదు. ఒకవేళ తల్లిదండ్రులు చూస్తే ఎంత దగ్గర వారిని అయినా సరే పిల్లల ముందు వారిని దండించాలి. అప్పుడు పిల్లలు జాగ్రత్త పడతారు. ముఖ్యంగా ఒడిలో కూర్చోబెట్టుకోవడం , వాళ్ళ బుగ్గలు గిల్లడం భుజాలు తడమడం లాంటివి కూడా చేయకూడదు.

- Advertisement -

పిల్లలకు శిక్షణ తప్పనిసరి..

ముఖ్యంగా మన దేశంలో పెద్దవాళ్లు ఆప్యాయతతో పిల్లలను దగ్గర తీసుకుంటారు. వారి బుగ్గలు గిల్లడం , చెవులు లాగడం లాంటివి చేస్తూ ఉంటారు. అవి సర్వసాధారణం.. కొందరు పిల్లలు వీటిని ఆస్వాదిస్తే మరి కొంత మంది చిరాకు పడతారు పిల్లల్ని బట్టి మనం నడుచుకోవాలి. ఇక్కడ పిల్లలకి లింగభేదం లేదు అమ్మాయిలు అయినా అబ్బాయిలైనా ఒకే నియమాలు ఉంటాయి అంటూ శ్రీకాంత్ తెలిపారు. ఒక మానసిక వైద్యుడిగా నేను ఎంతోమందికి వైద్యం చేయగా, నేను గమనించిన కొన్ని విషయాలు, కొందరి ఆందోళన ఉన్న వ్యక్తులని వాళ్ళ బాల్యం గురించి ప్రశ్నిస్తే వాళ్ళ తల్లిదండ్రులు వారిని ప్రేమించి వాళ్లకు కావాల్సినవన్నీ సమకూర్చినప్పటికీ కూడా వాళ్లకి ఇవ్వాల్సిన ప్రేమతో కూడిన స్పర్శ లేదా అభినందనలు ఇవ్వలేదని తెలిపారు. అందుకే ఇలాంటి అనవసరమైన వాదనకు దారితీస్తోంది.. దురదృష్టవశాత్తు అందరి బాల్యం ఆనందదాయకం కాదు కాబట్టి ఒక్కొక్కరి మనస్తత్వాన్ని బట్టి మనమే అర్థం చేసుకోవాలి అంటూ ఈయన స్పష్టం చేశారు. అంతేకాదు పిల్లలని మనం రక్షించడమే కాకుండా వాళ్ళని వాళ్ళు హానికి దూరంగా ఉండేలా శిక్షణ ఇవ్వాలంటూ విలువైన సూచనలు అందించారు సైకియాట్రిస్ట్ శ్రీకాంత్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు